
శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం ఆర్టీసీ బస్టాండ్ ఆటో యూనియన్, అంబేద్కర్ చౌరస్తా కేశవ ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో ఆదివారం కేశవపట్నం రహదారిపై పంపు లైన్ల కోసం తవ్వి వదిలిపెట్టిన కాలువల వలన టూ, త్రీ, ఫోర్ వీలర్ వాహనాలకు కలుగుతున్న ఇబ్బందితో ఆటో డ్రైవర్లు సుంకరి కిషోర్, ముజ్జు ల సౌజన్యంతో సిమెంటు, కంకర, ఇసుకతో రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చి గత ఐదేళ్ల పాలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గ్రామపంచాయతీ పాలక వర్గంలోను ఇలాంటి కార్యక్రమం చేశారు. ఈనాటి ప్రత్యేక అధికారుల పాలనను సైతం చూసి ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఆశించక అంబేద్కర్ చౌరస్తా నుండి జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల వరకు మళ్లీ ఒకసారి ఆ కాలువలను పూడ్చామమని ఆటో డ్రైవర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుంకరి కిషోర్, దొమ్మటి వెంకటస్వామి, పరమేశ్వర్, గడ్డం శ్రీకాంత్, రషీద్ బస్టాండ్ యూనియన్ సభ్యుడు, ముజ్జు తదితరులు పాల్గొన్నారు.