
మండలంలోని దుర్గా నగర్ కింది తండా గ్రామంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రెండవ ఎన్ఎస్ఎస్ శ్రమదానం బుదవారం చేశారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ గ్రామంలోని పాఠశాల పరిసరాలను, గ్రామపంచాయతీ పరిధిలోని వీధి బాటలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారిని డా. ఎం. సరిత మాట్లాడుతూ గ్రామంలోని యువతకు రక్తదానం యొక్క ప్రాముఖ్యతను వివరించి, ప్రతి ఒక్కరు రక్తదానములో పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు. పాఠశాలలోని విద్యార్థులకు వేసవికాలంలో నీటిని పొదుపు చేయడం మొక్కలను కాపాడడం మొదలైన అంశాల పైన అవగాహన కల్పించారు. దుర్గా నగర్ పాఠశాల హెచ్ఎం వెంగమాంబ గారు మరియు ఉపాధ్యాయులు శ్రీనివాస్ గారు ఎన్ఎస్ఎస్ విద్యార్థుల యొక్క సేవా నిరతిని కొనియాడారు. సమాజానికి సేవలు అందించడం విద్యార్థి దశలోనే అత్యున్నత లక్షణమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ మెంబర్స్ డి.సుమలత, పి. శ్వేత, విద్యార్థులు పాల్గొన్నారు.