వెంకట్రావుపేటలో ఉపాధి కూలీ మృతి

నవతెలంగాణ – కొనరావుపేట
వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఉపాధి హామీ పథకం లో బాగంగా పని చేస్తున్న సమయంలో మట్టి పెల్లలు కూలి  మారుపాక రాజవ్వ పై పడడంతో  తీవ్రంగా గాయ పడింది. గాయపడిన ఆమెను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సమయంలో పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. గాయపడిన మిగతా నలుగురు కూలీలుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.