కూలీలు ఉపాధిహామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

– ఉపాధిహామీ పథకం మండల ఏపీఓ హరీష్
నవతెలంగాణ – మల్హర్ రావు
జాబ్ కార్డున్న ప్రతి కూలీ ఉపాధిహామీ పథకాన్ని సద్వినియొగం చేసుకోవాలని ఉపాధిహామీ పథకం మండల ఏపీఓ గిరి హరీష్ సూచించారు. బుధవారం మండలంలోని మల్లారం గ్రామపంచాయితీ పరిధిలో చెరువు పూడికతీత పనులు పరిశీలించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై కూలీలకు అవగాహన కల్పించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 100 రోజుల పాటు ఉపాధిహామీ కూలి పనులు ప్రతి ఒక్కరికి నూతనంగా లభించడం జరుగుతుందన్నారు. కొలతల ప్రకారం పనిచేస్తే ఈ ఆర్థిక సంవత్సరం, కూలీలకు ఉపాధి వేతనం రూ.272 నుండి రూ.300 వరకు అనగా రూ.28 పెరగడం జరిగిందన్నారు. ఉపాధి కూలీలు ఈ అవకాశాన్ని వినియోగించుకొనీ,ఎక్కువ సంఖ్యలో కూలీలు ఉపాధిహామీ కూలి పనులకు వెళ్లాలని కూలీలకు ఏపీఓ అవగాహన కల్పించారు.ప్రతి ఉపాది కూలి వంద రోజులు పని చేస్తే రోజుకు రూ.300 చొప్పున రూ.30,000 వెలు పొందవచ్చన్నారు ఈ కార్యక్రమంలో  ఫీల్డ్ అసిస్టెంట్ సుమలత,మేట్స్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.