– జేఎన్‌టీయూ హెచ్ వైస్ చాన్సలర్ డాక్టర్ కట్టా నర్సింహా రెడ్డి
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
సైన్స్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక సదుపాయాలతో కూడిన ల్యాబ్‌లు, పరిశోధనకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నామని జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కట్టా నర్సింహా రెడ్డి, అన్నారు. జేఎన్‌టీయూ యూనివర్సిటీలో భాగమైన ఇనిస్టూట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. గత సంవత్సరం పదవి విరమణ పొందిన డాక్టర్ శశికళ తన పరిచయాల్ని ఉపయోగించి యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలోని సైన్స్ విభాగంలో స్పందన బిల్డింగ్‌లోని మాజీ ప్రిన్సిపాల్ కార్యాలయంలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో, ఆధునిక పరికరాలుతో పూర్తిస్థాయితో సుమారుగా రెండు కోట్లు ఖర్చుతో జేఎన్‌టీయూ యూనివర్సిటీలో మణి పూసల నిలిచే ఓ సైన్స్ ల్యాబ్ సిద్ధం చేశారు. ఈ ల్యాబ్ ప్రారం భోత్సవానికి ఆయనతో పాటు కంపెనీ సీఈఓ విజరు కార్గో, యూనివర్సిటీ రేక్టర్‌డాక్టర్ కె.విజయకుమార్ రెడ్డి, రిజిస్టార్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు పలువురు యూనివర్సిటీ అధికారులు యూనివర్సిటీ కేమిస్త్రీ డిపార్ట్మెంట్ విభాగాధి పతి డాక్టర్ సత్యనారాయణలు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా యూరోపిన్ మల్టి నేషనల్ కంపెనీ జేఎన్‌టీయూలో అనల్ట్ కల్ కెమిస్ట్రీ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇట్టి ల్యాబ్ వల్ల ఎంఎస్‌సీ నాలుగవ సెమిస్టరు వారికి ల్యాబ్‌లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కంపెనీ దేశ విదేశాల్లో ఎలాంటి ఆధునిక సౌకర్యాలతో కూడిన ల్యాబ్ నిర్వహించడం చేస్తున్నామో.. జేఎన్‌టీయూలో కూడ అదేవిదంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ల్యాబ్ కొంత కాలం కోసం ఏర్పా టు చేసింది కాదు.. పర్మినెంట్‌గా ఉంటుందని తెలిపారు. ల్యాబ్ టెక్నీకల్ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేసి విద్యార్థులుకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఎంఎస్సీ 4వ సెమిస్టరు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం కోసం మా కంపెనీ మావద్ద అనుభవం ఉన్న శాస్త్రవేత్తలను మేమే నియామకం చేసి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ లో మంచి ప్రావీణ్యం చురుకుగా ఉన్న వారిని, కొత్తగా ఆలోచన చేసే విద్యార్థులను మేము కంపెనీ ఉద్యోగం లో నియామకం చేస్తామన్నారు. అనంతరం ఎంఓయూ ఒప్పందం చేసుకొని ముందుకు పోతున్నామన్నారు. ఇంటర్ నేషనల్ స్టాండర్డ్‌కు తగిన విధంగా ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ఈ ప్రారంభ వేడుకలలో డైరెక్టర్లు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.