నవతెలంగాణ – ముత్తారం: ముత్తారం మండలంలోని జిల్లెపల్లి గ్రామానికి చెందిన గడ్డం రాజేశం కిడ్నీ వ్యాధితో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుం డగా, వైద్య ఖర్చుల కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా సిఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోగా 1లక్ష రూపాయల ఎల్ ఓసి మంజూరు అయ్యింది. ఈ మేరకు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాధితుని కుటుంబ సభ్యులు మంత్రి వ్యక్తిగత సహాయకుడు శుక్రవారం ఎల్ఎసిని అందజేశారు. వైద్య ఖర్చులకు ప్రభుత్వ పరంగా సహాయం అందించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఈ సందర్భంగా గడ్డం రాజేశం, ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.