
– 62 గ్రామాలకు నిలిచిపోయిన మంచినీటి సరఫరా…
– యుద్ద ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టిన ఇంట్రా ఏఈ శ్రీనివాస్…
నవతెలంగాణ – అశ్వారావుపేట
క్షేత్ర స్థాయి అధికారుల సమన్వయ లోపం గ్రామస్తులకు శాపంగా మారింది.దీంతో ప్రజలకు అనేక ఇక్కట్లు గురి అవుతున్నారు.శనివారం కొత్తూరు గ్రామస్తులు ఖాలీ బిందెలతో నిరసన చేపట్టడం ఇదీ ఓ కారణం కావడం విశేషం. మండల పరిధిలోని తిరుమలకుంట లో శుక్రవారం స్థానిక కార్యదర్శి డ్రైనేజీ పనులు నిమిత్తం జేసీ బీ తో నేలను తవ్వే క్రమంలో భూ గర్భంలో ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ ధ్వంసం అయింది.దీంతో ఈ పంచాయితీ దిగువున ఉన్న 20 పంచాయితీలు పరిధిలోని 62 గ్రామాలకు మంచి నీటి సరఫరా నిలిచిపోయింది.ఈ గ్రామాల్లో కొత్తూరు ఒకటి. దీంతో మిషన్ భగీరథ ఇంట్రా ఏఈ శ్రీనివాస్ యుద్ద ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టిన మంచినీటి సరఫరాను పునరుద్ధరించారు.