మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెనుక వైపు గల కిటికీ అద్దం చాలా రోజుల క్రితం పగిలినా అందులో పనిచేసే వైద్యులు పట్టించుకోవడం లేదు. వైద్యశాల ఊరికి దూరంగా ఉండి,ఆసుపత్రి వెనుక వైపు వ్యవసాయ క్షేత్రాలు ఉండడంతో చుట్టూ పక్కల విష సర్పాలు సంచరించే అవకాశం ఉంది.ఏ సమయంలోనైనా వెనుకవైపు నుండి ఆసుపత్రిలోకి ప్రవేశించి,రోగులకు గాని,అందులో పనిచేసే వైద్యులకు,సిబ్బందికి కాటు వేస్తే,వైద్యం దేవుడెరుగు ప్రాణం పోయే అవకాశం ఉంది. ఇదిలా ఉంటె పాము కాటు,కుక్కకాటు విరుగుడు కోసం మందును అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు ఉన్నా,మందును అందుబాటులో ఉంచడం లేదు. విరుగుడు మందు ఎందుకు లేదు అని పలుసార్లు సాధారణ సర్వసభ్య సమావేశంలో విలేకరులు,నాయకులు అడిగితే, వైద్యులు ఏదో ఒక సాకు చెపుతూ.. తప్పించుకుంటున్నారు.ఇకనైనా పగిలిన కిటికీ అద్దం ప్రదేశంలో కొత్త అద్దం అమర్చి,రోగులకు భద్రత కల్పించాలని,పలువురు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.