కళాశాల నేపథ్యంలో ముగ్గురు యువకులు చేసే అల్లరి ప్రధా నంగా రూపొందిన వినోదాత్మక చిత్రం ‘మ్యాడ్’ ఎంతటి సంచలన విజయాన్ని సాధిం చిందో తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘లడ్డు గాని పెళ్లి’ అనే బారాత్ గీతంతో ప్రచార కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించింది చిత్ర బృందం. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా దీన్ని విడుదల చేశారు. ‘మ్యాడ్’ చిత్రంలో భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ‘కళ్ళజోడు కాలేజీ పాప’ అనే పాట యువతను విశేషంగా ఆకట్టుకొని చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం ఆయన స్వరపరిచిన ఈ గీతం అంతకుమించిన ఆదరణ పొందుతుంది అనడంలో సందేహం లేదు. గాయని మంగ్లీతో కలిసి భీమ్స్ సిసిరోలియో స్వయంగా ఈ గీతాన్ని ఆలపించారు. సినిమా ఇతివత్తం, పాత్రలకు అనుగుణంగా.. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం అందరూ పాడుకునేలా ఎంతో అందంగా ఉంది. అందరూ మెచ్చుకునేలా ‘మ్యాడ్’ చిత్రాన్ని రూపొందించిన రచయిత, దర్శకుడు కళ్యాణ్ శంకర్.. సీక్వెల్‌ను మరింత వినోదాత్మకంగా మలిచే పనిలో ఉన్నారు అని చిత్ర యూనిట్ తెలిపింది. శ్రీకరా స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ : సూర్యదేవ నాగవంశీ.