లగడపాటి శ్రీధర్‌ డబుల్‌ ధమాకా

Lagadapati Sridhar double dhamaka– జివికె ఆల్‌ ఇండియా
– సీనియర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌
హైదరాబాద్‌ : తెలుగు సినీ నిర్మాత, ఔత్సాహిక టెన్నిస్‌ క్రీడాకారుడు లగడపాటి శ్రీధర్‌ డబుల్‌ ధమాకా చూపించాడు. మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన జివికె ఆల్‌ ఇండియా సీనియర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ (ఐఏఎస్‌టీఏ)లో లగడపాటి శ్రీధర్‌ పురుషుల సింగిల్స్‌తో పాటు డబుల్స్‌లోనూ విజేతగా నిలిచాడు. ఆదివారం ఎల్బీ స్టేడియంలోని శాట్‌ టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో జరిగిన ఫైనల్స్‌లో శ్రీధర్‌ రెండు విభాగాల్లోనూ టైటిల్స్‌ సొంతం చేసుకున్నాడు. మెన్స్‌ (55 ప్లస్‌) డబుల్స్‌ ఫైనల్లో ఆర్‌ఎన్‌ రమేశ్‌, పాల్‌ మనోహర్‌లతో మ్యాచ్‌ వర్షం కారణంగా సాగలేదు. దీంతో ఇరువురినీ సంయుక్త విజేతలుగా ప్రకటించారు. మెన్స్‌ సింగిల్స్‌లోనూ ఆర్‌ఎన్‌ రమేశ్‌తో మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. ఆర్‌ఎన్‌ రమేశ్‌తో కలిసి శ్రీధర్‌ టైటిల్‌ను పంచుకున్నారు. గత ఏడాది ఐఏఎస్‌టీఏలో చాంపియన్‌గా నిలిచిన శ్రీధర్‌.. వరుసగా రెండోసారి ఇక్కడ టైటిల్‌ నిలబెట్టుకున్నాడు.