హాయిగా నవ్వించే ‘లైలా’

'Laila' who laughs comfortably‘అడల్ట్‌ కామెడీ అన్ని చోట్ల ఉంది. ట్విట్టర్‌ ఓపెన్‌ చేస్తే కనిపించేదంతా అదే కదా. దానితో పోల్చుకుంటే మా ‘లైలా’లో ఉంది చాలా తక్కువ. హీరో లేడీ క్యారెక్టర్‌, కొందరికి అర్ధం కాని డెక్కన్‌ లాంగ్వేజ్‌ మాట్లాడటం వలన సెన్సార్‌ వాళ్ళు ‘ఏ’ సర్టిఫికేట్‌ ఇచ్చారు. కానీ సినిమాలో ఆడల్ట్‌ కామెడీ అంటూ ఏమీ లేదు. రెగ్యులర్‌గా మనం మాట్లాడుకున్నట్లే ఉంటుంది’ అని నిర్మాత సాహు గారపాటి అన్నారు. విశ్వక్‌సేన్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘లైలా’. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహించారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి మీడియాతో ముచ్చటించారు.
– ఈ సినిమా నిర్మించడానికి నన్ను బాగా ఎట్రాక్ట్‌ చేసిన ఎలిమెంట్‌ ఒక్కటే.. కామెఈ. పైగా ఇలాంటి కథలు వచ్చి చాలా కాలమైంది. విశ్వక్‌ చాలా జీల్‌ ఉన్న యాక్టర్‌. ఈ కథ విన్న వెంటనే ‘ఇది నేను చేయాల్సిన క్యారెక్టర్‌’ అని చెప్పారు. ఇందులో లవ్‌స్టోరీతో పాటు వినోదమూ ఉంది. ఈ కథని దర్శకుడు రామ్‌ నారాయణ్‌ చాలా బాగా తెరకెక్కించాడు.
– ఫస్ట్‌ హాఫ్‌ అంతా సోను ఉంటాడు. తన లవ్‌ స్టోరీ ఫస్ట్‌ హాఫ్‌లో ఉంటుంది. అనుకోని కారణంగా తనని లైలాగా మార్చుకుని ఇన్నోసెన్స్‌ని ప్రూవ్‌ చేసుకుంటాడు. ఆ రీజన్‌ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. లైలాగా, సోనుగా విశ్వక్‌సేన్‌ అద్భుతంగా నటించాడు. లైలా గెటప్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాని యూత్‌ టార్గెట్‌గా చేశాం. అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా ఎంజారు చేస్తారు. హాయిగా నవ్వించాలనే ప్రయత్నంతో చేసిన సినిమా ఇది.
– చిరంజీవి ట్రైలర్‌ చూశారు. కొత్త ప్రయత్నం చేశామని విశ్వక్‌ని మెచ్చుకున్నారు. ఆయనకి ట్రైలర్‌ చాలా బాగా నచ్చింది. మమ్మల్ని ఎంకరేజ్‌ చేయడానికి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి వస్తున్నారు. చిరంజీవితో మేం చేయబోయే సినిమా మే, జూన్‌లో స్టార్ట్‌ అవుతుంది. నెక్స్ట్‌ సంక్రాంతికి రిలీజ్‌ చేస్తాం. అనిల్‌ రావిపూడి మార్క్‌లో పర్ఫెక్ట్‌ కమర్షియల్‌ సినిమాలా ఉంటుంది. వింటేజ్‌ చిరంజీవిలా ఆయన రోల్‌ ఉంటుంది.
– నిర్మాత సాహు గారపాటి