
ఓట్లు సీట్లు అంటూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లాకవత్ నరసింహ అన్నారు. శుక్రవారం మండలంలో గత రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యం రాశులను బిఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ ఎంతసేపు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి మంత్రివర్గ సభ్యులు ప్రతిపక్షాలను దుమ్ము ఎత్తిపోయడమే తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా పక్కదో పట్టించడం పరిపాటిగా మారిందని అన్నారు. యాసంగి పంట ఇప్పటికి నాలుగు సార్లు వర్షం కురిసి తడిసి రైతులు ఇబ్బందులు పడుతుంటే ఏ ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ కానీ అధికారి కానీ ఇప్పటివరకు రైతులను పట్టించుకునే నాధుడే కరువు ఆయ్యాడని అన్నారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దు తడిసిన ధాన్యాన్ని ఖరీదు చేయాలని మాటలను హామీలను కేవలం పత్రికలకు విడుదల చేయడమే తప్ప వాస్తవంగా అమలు చేసింది లేదన్నారు.
ఖరీదు కేంద్రాల వారు మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు అందలేదని చెబుతూ తడిసిన ధాన్యాన్ని ఖరీదు చేయకుండా రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని అన్నారు. తేమ శాతం లోను తడిసి రంగు మారిన ధాన్యం, భూమిలో తేమ వల్ల కాస్తో కూస్తో మొలకెత్తిన ధాన్యం కొనుగోలు విషయంలో నిబంధనలను సడలించిన మని చెబుతున్న ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల తరువాత కూడా రెండు వర్షాలు కురవడం జరిగింది స్థానిక మంత్రి ఇప్పటివరకు రైతుల సమస్యలపై తడిసిన ధాన్యాన్ని, గాలికి పైకప్పులు ఎగిరిపోయి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను రైతులను పరిశీలించడం పరామర్శించడం ఆదుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. ధాన్యం దిగుమతి కాకుండా మిల్లర్లు సతాయిస్తున్నారని రైతులు తెలుపుతున్నందున ఆ సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎన్నికలు పూర్తయినాయి ఒత్తిడి తగ్గింది ఇంకా వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం మంత్రులు అధికారులు కళ్ళు తెరిచి ప్రజా సమస్యలపై ప్రధానంగా తడిచిన దాన్యం సమస్యలపై దృష్టి సారించాలని పరిష్కారం చూపించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతు కమిటీ అధ్యక్షులు సూరినేని రవీందర్ మాజీ సర్పంచ్ ధారావత్ రాకేష్ ఉపసర్పంచ్ అల్లం లేని హనుమంతరావు రైతులు జాస్తి శ్రీనివాసరావు, యల్ రవి, బెల్లీ లింగయ్య, లక్ష్మణ్, కుశలరావు, వెంకటేష్, కృష్ణ ,రాధాబాయి తదితరులు పాల్గొన్నారు.