లక్ష కోట్లు

మీకు తెలుసానుల్ల.. గియ్యాల రాష్ట్రంల ఎక్కడజూసిన రూ.లక్ష కోట్ల మాటే ఇనబడుతుండే. గండ్ల ఏముంది అనుకుంటున్నర.. గండ్లనే ఉంది అసలు సంగతి. సారు, కారు సర్కారు కథ కంచికిపాయే. పెద్దసారుగా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు అప్పుతెచ్చి మనలను, మన పిల్లగాండ్లను అప్పులపాలు జేసిండని ఉత్తమ్‌ సారు పదే పదే చెప్పబట్టే. మేడిగడ్డ బొందలగడ్డగా మార్చిండనే ఇమర్మలు ఒక్కటే చేయబట్టే. తండ్రీకొడుకులు అప్పులు కట్టాలని మంత్రులు సైతం అల్టీమేటమ్‌ ఇయ్యబట్టే. చల్‌ నేనెందుకు కడత అని గులాబీ బాస్‌ అనబట్టే. కానీ ఈళ్ల లొల్లిల జనం పరేషాన్‌ కాబట్టిరీ. ఎందుల్ల ఈళ్ల గొల రోజూ అని. మేడిగడ్డ పగుళ్లు చూస్తే గుండె గుబుల్‌ అనబట్టే. అచ్చే నెలల మళ్లీ ఎంపీ ఎలచ్చన్లు రాబట్టే. ఎక్కడ అర్థమైతలేదు 80 ఎయిల పుస్తకాలు చదివిన పెద్దసారుకు. చట్టం ప్రకారం కచ్చితంగా యాక్షన్‌ తీసుకుంటమని రేవంత్‌ సార్‌ గవర్నమెంటు బరాబర్‌ చెప్పబట్టే. మీకు సమజైందనుకుంటే ముచ్చట. మనకెందుకు అనుకోకుర్రీ. ఉంట మరీ.
– బి. బసవపున్నయ్య