ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లక్ష ఉత్తరాలు..

Lakh letters to Chief Minister Revanth Reddy..నవతెలంగాణ – కంఠేశ్వర్

జనవరి 26న భారత రాజ్యాంగం బుక్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లక్ష ఉత్తరాలు పంపుతున్నామని డి.ఎస్.పి జిల్లా అధ్యక్షులు మహిపాల్ మహారాజ్ తెలిపారు. ఈ మేరకు గురువారం నగరంలోని ఆర్ఎంపీ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ పార్టీ జిల్లా అధ్యక్షులు  మహిపాల్ మహారాజ్ మాట్లాడుతూ.. భారతదేశ సమస్తాన్ని అధిశాసనరూపంలో నడిపించే సుప్రీం పవర్ భారత రాజ్యాంగం అందరికీ తెలిసిన విషయమే. అందుకని భారత గణతంత్ర దినోత్సవం – భారత రాజ్యాంగ అమలు దినం ఐన రిపబ్లిక్ డే రోజు జనవరి 26 న జాతీయ జెండా వద్ద భారత రాజ్యాంగ గ్రంథాన్ని, దాని రూపశిల్పి డా. అంబేడ్కర్ చిత్రపటాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని, ప్రతిరోజూ విద్యా సంస్థలలో విద్యార్థులు చదివే ప్రార్ధనా స్థానంలో భారత రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞగా చదివించేలాగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వేతర సంస్థలను కూడా ఆదేశించాలని డిమాండ్ లేఖను రాస్తున్నామన్నారు త్వరగా అమలు నిర్ణయాన్ని జీవో ద్వారా తీసుకుంటారనీ ఆశిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ప్రేమ్ కుమార్,జిల్లా నాయకులు మురళి,ప్రశాంత్,సుభాష్,మండలాల అధ్యక్షులు మైపాల్,శ్రీకాంత్,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.