×
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఎస్సీ వర్గీకరణ త్వరితగతిన అమలు చేయడానికి ఎంఆర్పీఎస్ ఆద్వర్యం లో మంద క్రిష్ణ నేతృత్వంలో ఈ నెల 7 న తలపెట్టిన లక్ష డప్పులు – గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాదిగలు భారీ ఎత్తున తరలిరావాలని ఎంఆర్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు.
ఈ మేరకు వారు నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో మూడు రోడ్ల కూడలి లోని భారత రత్న,రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా సోమవారం లక్షల డప్పులు – వేల గొంతులు పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మాదిగ నాయకులు,యువకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.