– చిలుక పలుకులు పలుకుతున్న సంబంధిత అధికారులు
నవతెలంగాణ – రాయపర్తి
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడానికి గ్రామాల్లో లక్షల రూపాయలు వేచించి పల్లె దవాఖాన భవనాలను నిర్మించారు కానీ వాటిని ప్రారంభించడం మరిచారు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని సన్నూరు గ్రామంలో 16 లక్షల రూపాయలకు పైగా డబ్బులను వేచించి పల్లె దవాఖాన భవనాన్ని నిర్మించారు. తాజా మాజీ సర్పంచ్ నల్లమాస సారయ్య తమ గ్రామస్తులకు నాణ్యమైన వైద్యం అందుతుందని భావించి ముందుండి మరి భవనాన్ని నిర్మించారు. కానీ సంబంధిత అధికారులు భవనాన్ని ప్రారంభించకపోవడంతో ఆకతాయిలు కిటికీ అద్దాలను పగలగొట్టారు. మెయింటెనెన్స్ లేకపోవడంతో భవనం గోడలు పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. సొంత భవనం ఉన్నప్పటికీ సన్నూరు గ్రామంలో పల్లె దవాఖాన ప్రైవేటు భవనంలో ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్రను వీడి పల్లె దవఖానాను ప్రారంభించి ప్రజలకు వైద్యం అందేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.