సమాచార హక్కు చట్టం – 2005 అమలు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి దరఖాస్తుదారుడికి కోరిన సమాచారాన్ని అందించక, రికార్డుల తనిఖీకి అనుమతించక చట్ట ఉల్లంఘనకు పాల్పడిన లక్షెట్టిపేట ఉప-కోశాధికారి కార్యాలయ ప్రజా సమాచార అధికారిపై, మంచిర్యాల కోశాధికారి కార్యాలయ మొదటి అప్పీలేట్ అధికారిపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన ఆర్టీఐ దరఖాస్తుదారుడు మేకల అక్షయ్ కుమార్ ఢిల్లీ ఢిల్లీలోని కేంద్ర సమాచార కార్యాలయంలో ఉన్నతాధికారులకు దరఖాస్తు చేయడం జరిగిందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను దరఖాస్తులో కోరిన సమాచారాన్ని తనకు ఇప్పించాలని, సంబంధిత రికార్డుల తనిఖీ చేయుటకు తనకు అనుమతించాలన్నారు. చట్ట ఉల్లంఘనకు పాల్పడిన సంబంధిత అధికారుల నుండి చట్టప్రకారం తనకు నష్టపరిహారాన్ని ఇప్పించాలని కోరుతున్నామన్నారు.