మండలంలోని కోతులారం గ్రామానికి చెందిన కత్తుల లక్ష్మమ్మ అనారోగ్యానికి గురై మంగళవారం రాత్రి మృతి చెందగా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వట్టి కోటి శేఖర్ బుధవారం లక్ష్మమ్మ భౌతికయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆ కుటుంబాన్ని పరామర్శించి పదివేల ఆర్థిక సాయంని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకొని తమ వంతు పేద కుటుంబాలకు సాయం అందిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపూరి యాదయ్య, మాజీ సర్పంచి పందుల అంజయ్య, మాజీ వార్డ్ నెంబర్ గుండు రవీందర్, కొండూరి నరసింహ, గుండు చిన్న కృష్ణయ్య, జాజుల బిక్షపతి, రాపోలు బిక్షపతి, ఏర్పుల అంజయ్య, ఏర్పుల హనుమయ్య,కత్తుల యాదయ్య,గుల్లి శంకరయ్య,జాల బచ్చి ప్రసాద్, కర్నాటి వెంకటేష్, జె వి,పందుల శివశంకర్, పందుల యాదగిరి, ఏపూరి కిరణ్ తదితరులు ఉన్నారు.