ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీ భూమయ్య ఏకగ్రీవ ఎంపిక…

నవతెలంగాణ: రెంజల్
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ జిల్లా నూతన కమిటీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనిగరం మురళి కృష్ణ ఆధ్వర్యంలో రెంజల్ మండల కేంద్రానికి చెందిన లక్ష్మీ గారి భూమయ్యను ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన లక్ష్మి గారి భూమయ్య మాట్లాడుతూ జిల్లా నాయకులు, జిల్లా ఇన్చార్జికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తమ జాతి శ్రేయస్సు కోసం నిరంతరం పోరాటం చేస్తానని ఆయన ఈ సదర్భంగా స్పష్టం చేశారు.