
పదర మండలంలోని రాయలగండి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఉత్సవాలు వచ్చే నెలలో జరగనున్నాయి. ఎమ్మెల్యే వంశీకృష్ణ తన నిధుల నుంచి రూ.63 లక్షలు కేటాయించారు. పలు అభివృద్ధి పనులను శనివారం సీబీఎం ట్రస్ట్ ఛైర్మన్ , అమ్రాబాద్ జెడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ అనురాధ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు , మండల పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.