– రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు
నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ నియోజకవర్గం అక్కా చెల్లెళ్ల ఆశీర్వాదంతోనే ఎమ్మెల్యేగా గెలిచా. ఇక అక్కాచెల్లెళ్ల ఆశీర్వాదంతోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు నియోజకవర్గంలోని అక్క చెల్లెలు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నా చెల్లెళ్ల అనురాగ బంధం అక్కా తమ్ముళ్ల ఆప్యాయ బంధం రక్షా బంధన్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అక్కా చెల్లెళ్ల మీకు, మీ కుటుంబ సభ్యులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.