ఓటర్లకు లక్ష్మీ కటాక్షం

ఓటర్లకు లక్ష్మీ కటాక్షంఇప్పటి వరకు తెలుగులో చాలా తక్కువ సెటైరికల్‌ కాన్సెప్ట్స్‌ వచ్చాయి. అందులోనూ పొలిటికల్‌ సెటైరికల్‌ కామెడీ మాత్రం ఇంకా తక్కువ వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో ప్రేక్షకులను నవ్వించడానికి ‘లక్ష్మీకటాక్షం’ సినిమా నుండి డైలాగ్‌ పోస్టర్‌ని మేకర్స్‌ రిలీజ్‌ చేేశారు. రాజకీయనాయకులు ఒక ఓటుకి ఇంత డబ్బులు అని నిర్ణయిస్తారు. కానీ ఈ డైలాగ్‌ పోస్టర్‌లో ఓటరే తన రేటును తాను నిర్ణయించుకుంటాడు. మహతి ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్‌ పై వస్తున్న ఈ ‘లక్ష్మీ కటాక్షం : ఫర్‌ ఓట్‌’కు రచన, దర్శకత్వం సూర్య అందించారు. యు.శ్రీనివాసుల రెడ్డి నిర్మించగా, అభిషేక్‌ రుఫుస్‌ సంగీతం అందించారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ప్రతిబింబంగా ఉన్న ఈ డైలాగ్‌ పోస్టర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. సాయి కుమార్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం వినరు, అరుణ్‌, దీప్తి వర్మ మెయిన్‌ లీడ్స్‌గా చేస్తున్నారు. ఈ కథా నేపథ్యం మొత్తం తాడిపత్రిలో చిత్రీకరించినట్టు యూనిట్‌ తెలిపింది. త్వరలోనే సరదాగా ఉండే టీజర్‌, ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తామని మేకర్స్‌ పేర్కొన్నారు. చరిస్మా శ్రీకర్‌, హరి ప్రసాద్‌, సాయి కిరణ్‌ ఏడిద, ఆమని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: యు. శ్రీనివాసుల రెడ్డి, బి.నాగేశ్వర రెడ్డి, వహీద్‌ షేక్‌, కే.పురుషోత్తం రెడ్డి, రచన, డైరెక్టర్‌: సూర్య, మ్యూజిక్‌: అభిషేక్‌ రుఫుస్‌, డిఓపి: నని ఐనవెల్లి, ఎడిటర్‌: ప్రదీప్‌ జే, సౌండ్‌ డిజైన్‌: మురళీధర్‌ రాజు.