లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

నవతెలంగాణ – తుర్కపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురం వెంకటగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రోజు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవం కి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. కళ్యాణంలో భాగంగా మాంగల్య ధారణ తంతును వీక్షించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామి వారి శాలువా కప్పి ఆశీర్వచనం అందజేశారు.వీరితో పాటు మండల కాంగ్రెస్ పార్టీనాయకులు,ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.