భువనగిరి మండలంలోని నమాత్ పల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ అతికం లక్ష్మీనారాయణ అవినీతి జరిపినట్లు, ఆ గ్రామ నాయకులు సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎల్లంల జంగయ్య యాదవ్ దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా, ఫిర్యాదు మేరకు శనివారం శ్రీ పూర్ణగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుమతి, ఎండోమెంట్ అధికారి నరేందర్ రెడ్డి సమక్షంలో గర్భగుడిలో విచారణ జరిపారు. ఫిర్యాదు మేరకు విచారణ జరిపినట్లు త్వరలో నివేదిక పై అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కంబాలపల్లి బిక్షపతి యాదవ్, మట్ట శంకర్ బాబు, ఎల్లంల వెంకటేష్ యాదవ్, జిట్టా అశోక్ రెడ్డి, బత్తిని సుధాకర్ గౌడ్, మట్ట బాలకృష్ణ గౌడ్, మట్ట సైదులు గౌడ్, సురూపంగా నరసింహ, సురూపంగా కిష్టయ్య, ఏల్లంల నరసింహ యాదవులు పాల్గొన్నారు.