
ప్రణాళికా బద్ధంగా,అంకితభావం,స్వయం క్రమశిక్షణతో ముందుకు వెళ్ళడం ద్వారా జీవితంలో అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందని ప్రముఖ విద్యావేత్త,కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ బి.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం నారంవారిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పున్నెం చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాలాన్ని బట్టి అవకాశాలను,మన అభీష్టం కు అనుగుణంగా భవిష్యత్తులో కోరుకున్న ఉన్నత స్థితిలో స్థిర పడవచ్చని, ఇదంతా కూడా ప్రణాళిక, స్వయంకృషి తోనే సాధ్యమని ఆయన వివరించారు. ప్రధానోపాధ్యాయులు పున్నెం చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ విద్యార్ధి దశలోనే మనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా పట్టుదలతో కృషి చేయాలని తద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని ఆయన పేర్కొన్నారు.సీనియర్ ఉపాధ్యాయులు బండి శ్రీనివాసరెడ్డి,యల్.రేణుక,కెరీర్ గైడెన్స్ టీచర్ కే.రామారావు లు విద్యార్థులకు మల్టిపుల్ ఇంటిలిజెన్స్ టెస్ట్ మరియు డ్రీమ్ కార్నర్ నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ లక్ష్మీనారాయణ కు పాఠశాల సిబ్బంది చిరు సత్కారం చేశారు.కార్యక్రమంలో మిగిలిన ఉపాధ్యాయులు హరినాథ్ బాబు,సుజాత,బుల్లెమ్మ, రమేష్ లు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కి సంబంధించిన పలు సూచనలు చేశారు.