
పట్టణం లోని చిన్న బజార్ లో గల లక్ష్మీనారాయణ మందిరంలో లక్ష్మీనారాయణుల కళ్యానోత్సవాన్ని క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మంగళవారం నిర్వహించారు. పండితులు సత్యం పంతులు, వెంకన్న పంతులు, మహాలక్ష్మి పంతులు వేద మంత్రోత్సవాల మధ్య కళ్యాణం కమనీయంగా రమణీయంగా సాగింది. ఈ కళ్యాణోత్సవంలో వధువు తరుపున కార్యదర్శి బారడ్ గంగామోహన్ రమాదేవి దంపతులు, వరుడి తరఫున ఉపాధ్యక్షుడు రెడ్డి ప్రకాష్ దంపతులు వ్యవహరించారు. సాంప్రదాయబద్దంగా పూజలు, యజ్ఞాన్ని నిర్వహించి హరతి ఇచ్చారు. ఆలయంలో పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. రాత్రి 7 గంటలకు మంగళ వాయిద్యాలతో పల్లకి సేవను నిర్వహించారు. క్షత్రియ సమాజానికి చెందిన మహిళలు, పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు హజారి మదన్ మోహన్, క్షత్రియ ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి ఖాందేష్ శ్రీనివాస్, కౌన్సిలర్ సంగీత ఖాందేష్, కోశాధికారి వైద్య సంజయ్, ఉపాధ్యక్షులు గటడి కిషన్, డీకే శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులు హజారి రమేష్, బదాం రాజేందర్, షికారి శ్రీనివాస్, సంతని విజయ్, సర్వసమాజ్ ఉపాధ్యక్షుడు వైద్య రవీందర్, కార్యదర్శి కర్తన్ దినేష్, యువజన సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు సాత్ పుతే సంతోష్, దుమానీ నీరజ్, క్షత్రియ సమాజ్, యువజన సమాజ్ సభ్యులు పాల్గొన్నారు.