లక్ష్యసేన్‌ ముందంజ

లక్ష్యసేన్‌ ముందంజ– ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ 1000
జకర్తా : ఇండోనేషియా ఓపెన్‌లో లక్ష్యసేన్‌ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో 21-12, 21-17తో సులువైన విజయం సాధించాడు. జపాన్‌ షట్లర్‌ను చిత్తు చేసి టోర్నీలో ముందంజ వేశాడు. సీనియర్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌ ప్రణరుపై 21-17, 21-12తో ప్రియాన్షు రజావత్‌ మెరుపు విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో ట్రెసా, గాయత్రి జోడీ 21-15, 21-11తో ముందంజ వేసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి, సుమిత్‌ జంట 18-21, 21-16, 21-17తో రెండో రౌండ్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్‌లో అగ్ర షట్లర్‌ పి.వి సింధు నేడు బరిలోకి దిగనుంది.