లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి వేడుకలు

– జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ
నవతెలంగాణ-మల్హర్ రావు : భారతరత్న అవార్డ్ గ్రహీత,భారతదేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి వర్థంతి వేడుకలు జాతీయ బిసి సంఘము జిల్లా ఇంచార్జి విజయగిరి సమ్మయ్య ఆధ్వర్యంలో గురువారం మండలంలోని కొయ్యుర్ ఘనంగా నిర్వహించారు.అలాగే ఉద్యమ కారుడు ఒడ్డెర ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జై జవాన్ –జై కిసాన్ ని పోరాడిన స్వతంత్ర సమరయోధుడు లాల్ బహుదూర్ శాస్త్రిని, ఎన్నో పోరాటాలు,ఉద్యమాలు చేసిన ఘనత ఒబన్నదని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు అడ్డూరి తిరుపతి.సతీష్. ఎస్టి. ఎస్సీ సంఘం నాయకులు నారాయణ. దామెర ముత్తన్న. లచ్చన్న. సమ్మరాజు.మహిళ నాయకురాలు  రజిత  పాల్గొన్నారు.