లాల్‌ సలామ్‌…

Lal Salam...కాలపు సెలిమలో ఇంకిపోయిన
బడుగుల సముద్రమా
లాల్‌ సలామ్‌..
కాలపు తీరంలో కరిగిపోయిన
విప్లవ కెరటమా
లాల్‌ సలామ్‌..

కాలపు ప్రయాణంలో
ప్రగతి పథివై సాగిన మహానేతా
ప్రశ్నించే ప్రజల గొంతుక
లాల్‌ సలామ్‌..
ఎర్రజెండా సూర్యతేజమా
ఎజెండాను దేశమంతా చాటిన
కమ్యూనిజ భావసారమా
లాల్‌ సలామ్‌..

ప్రజల పొద్దై ప్రజాభిమాన ముద్దుయై
కాలపు సడిలో జ్ఞాపక చరితైన
ఏచూరి సీతారామా
లాల్‌ సలామ్‌..

రాజకీయ క్షేత్రంలో
ప్రజాస్వామ్య పంథాలో
మెరుగైన మేరుశిఖరమె..
ప్రతి హృదయ ఉత్తేజ కిరణమై
మానవత్వ ప్రతిమై
కల్మశంలేని కాంతి పుంజమై
భారత పుస్తకంలో ఏచూరి సీతారామై
ఓ గొప్ప ప్రజా ప్రస్థాన కమ్యూనిజం కొండ
లాల్‌ సలామ్‌..
ఎన్నో గుండెల్లో చప్పుడై విలసిల్లిన
ఈ కమ్యూనిజం దిగ్గజమా
లాల్‌ సలామ్‌..
– అభిరామ్‌