పోరాటాల రాములు… నీకు లాల్‌ సలాములు

పోరాటాల రాములు... నీకు లాల్‌ సలాములుతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రపంచ స్థాయిలో ప్రత్యేక స్థానం ఉంది.సామాన్య ప్రజలు ఆయు ధాలు ధరించి వెట్టికి వ్యతిరేకంగా, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా కుల మతాలకు అతీతంగా నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎర్రజెండా నాయకత్వంలో పోరాడి ప్రజలు గెలిచిన పోరాటం అది…ఆ పోరాటా నికి ఆయువుపట్టుగా నిలిచిన గ్రామమే ఉమ్మ డి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజక వర్గంలోని కర్విరాల కొత్తగూడెం.ఆ ఊరు పేరు చెప్పగానే పోరాటం గుర్తుకొస్తుంది… ఎర్రజెండానెత్తిన వీరులు గుర్తుకొస్తారు. ముఖ్యంగా భీమి రెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, వర్దెళ్లి వీరులు (బుచ్చి రాములు) గుర్తు కొస్తారు. గ్రామంలో ఒక సామాన్య గీత కార్మిక కుటుంబంలో 1945లో పుట్టిన ఎర్రమందారమే మన వర్దెళ్లి రాములు. ఆయన చదివింది మూడోతరగతి కానీ మార్క్సిజం -లెనినిజం విధానాన్ని అర్థం చేసుకున్న నికార్సయిన కమ్యూనిస్టు. జాతీయ, అంతర్జాతీయ రాజకీ యాలను అర్థం చేసుకుని తోటి సహచరులకు సునాయా సంగా చెప్పిన దిశాలి. పాటలంటే ఇష్టం…పార్టీ ఊరేగింపు లో ముందుండి నినాదాలిచ్చి జైకొట్టి గాండ్రించిన నాయ కుడు. తండ్రి వారసత్వంగా వచ్చిన కళావృత్తిని పన్నేండ్ల వయసులో చేపట్టి, గీత కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, అధిక శిస్తులకు, అబ్కారీ అవినీతికి వ్యతిరేకం గా నిలబడ్డ నిస్వార్థపరుడు. 1978లో తుంగతుర్తి రైతు సేవా సహకార సంఘం చైర్మన్‌గా మొట్టమొదటగా గెలిచా డు. కర్విరాల వాటర్‌ షెడ్‌ ఛైర్మన్‌గా గెలిచి సన్న, చిన్న కారు రైతులకు పంటరుణాలిప్పించి రైతులకు దగ్గర య్యాడు. వాటర్‌షెడ్‌ చైర్మన్‌గా ఉండి వరద కాలువలు కట్టి చెక్‌డ్యాంలు ని ర్మించి ప్రజలుమెచ్చిన ప్రజాప్రతినిధిగా నిలిచాడు.
నిర్బంధాలెన్ని ఎదురైనా…
1980 సంవత్సరంలో… అప్పటి దాకా ఎర్రజెండాను చేతబట్టి సీపీఐ (ఎం)లో ముఖ్యమైన ప్రజా నాయ కుడిగా ఉన్న కుశలవరెడ్డి పార్టీని విడిచి టీడీపీలో చేరారు. వాస్తవానికి కుశలవ రెడ్డి పేరు చెప్పితే చుట్టూరా గ్రామాల దొరలకు, కాంగ్రెస్‌ గుండాలకు హ డల్‌. వర్దెళ్లి రాములుకు రాజకీయ గు రువు కుశలవ రెడ్డినే… గురువు వెంట నడవాలా? పార్టీ లైన్‌లో ఉండాలా? అనే సమస్య వస్తే వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీ వైపు ఉండడమే ముఖ్యమని భావించి అన్న బుచ్చి రాములు మాట జవదాటని తమ్ముడే రాములు. వెంటనే కుశలవరెడ్డి గ్రూపు నుంచి కష్టాలు, నిర్బంధాలు, దాడులు, దౌర్జన్యాలు గ్రామంలో పెరిగాయి. రాజకీయా గురువు కుశలవరెడ్డికి దీటుగా గ్రామం లో ఉన్న యువకులను కూడగొట్టి రాజ కీయా తర్పిదుతో పాటూ కర్రసాము, వడిచేల తిప్పడం, శత్రువుల నుండి ఎలా కాపాడుకోవాలో పైపార్టీ డైరెక్షన్‌లో శిక్షణ తీసుకు న్నారు. మొట్టమొదటిసారిగా కుశలవరెడ్డికి ఎదురు నిలిచాడు రాములు.
చావును సవాల్‌ చేసిన ధైౖర్యశాలి
అది 1994 సంవత్సరం. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత రోజు కుశలవ రెడ్డి మనుషులకు పార్టీ కార్యకర్తల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఆ సందర్భంగా గుం డాల గుంపును పార్టీ కార్యకర్తలు తరిమికొట్టారు. కానీ శత్రువులంతా ఒక దగ్గర పోగై వ్యవ సాయ బావి దగ్గర ఒక కామ్రేడ్‌తో ఉన్న రాములును చుట్టు ముట్టి మారణాయుధాలతో తీవ్రం గా దాడి చేశారు. ఈ సందర్భంగా రాములు తన చావు తప్పదనుకొని గొడ్డలితో శత్రువులపై ఎదురుదాడి చేశాడు. కానీ ఆగ్రహంతో ఉన్న శత్రువులు రామన్న కాళ్లు, చేతులు నరికారు. ఇక చనిపోయాడని వది లేసి వెళ్ళారు. కొనఊపిరితో ఉన్న రాములును హైదరాబాద్‌లోని నిమ్స్‌ హాస్పిటల్‌ చేర్పించగా, చాలాకాలం పాటు చికిత్సపొంది ప్రాణాలతో బయటపడ్డాడు. వర్దెల్లి రాములు చిన్నకుమారుడు కృష్ణ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ యూటీఎఫ్‌లో పని చేసేవారు. ఆయన భార్య అరుణ కర్విరాల కొత్త గూడెం సీపీఐ(ఎం) నుండి 2006లో ఎంపీటీసీగా గెలిచారు. కాంగ్రెస్‌ పార్టీ ఒక్క ఎంపీటీసీ స్థానం ఉంటే ఎంపీపీ అయ్యే అవకాశం ఉంది. ‘మన అరుణను ఎంపీపీ చేస్తాం. మా వైపు రండి అని ఒత్తిడి చేశారు. రూ.10లక్షలు ఇస్తాం’ అని, తమ పార్టీలో చేరమని ఆశ చూపారు. ఆ సమయంలో వర్దెళ్లి రాములు ఆయన సతీమణి లింగమ్మ ఒక్కటే చెప్పారు. ‘చావనైనా చస్తాము కాని పార్టీ మారం. అమ్ముడుపోయే పరిస్థితి ఉండదు’ అని ఆ నాయకులకు తెగేసి చెప్పారు. దీంతో వారికి ఎంపీపీ అయ్యే అవకాశం లేకుండా చేసి పార్టీ నిర్ణ యాన్ని కట్టుబడి ఉన్నారు.
నిబద్దతకు నిదర్శనం వర్దెల్లి సోదరులు
వాస్తవానికి గ్రామం వదిలితే పెద్ద నాయకుడయ్యే అవకాశం ఉంది.. తన ఆన్న వర్దెల్లి బుచ్చి రాములు (తుంగ తుర్తి, సూర్యాపేట) ఉమ్మడి తాలూకా కార్యదర్శిగా పనిచే స్తున్నారు. రాములు ఊర్లో లేకపోతే కుశలవరెడ్డి కార్యకర్త లను మిగలనీయడు. కార్యకర్తలకు రక్షణ లేక చెదిరిపో తారు. రాములు కొత్తగూడెంలో ఉంటేనే చుట్టూరా గ్రామా ల్లో పార్టీ నిలబడుద్ది అని బుచ్చి రాములు డైరెక్షన్‌ ప్రకారం ఊరిని అంటి పెట్టుకొని నిలబడ్డాడు. పార్టీని కుశలవ రెడ్డి గుంపు నుండి కాపాడుకునేందుకు రాములు ఇద్దరు కుమా రులు శ్రీహరి (ఇంజనీరు), కృష్ణ (ఉపాధ్యాయుడు) కర్ర పట్టుకుని కార్యకర్తలకు అండగా నిలిచారు. శ్రీహరి, భార్య లక్ష్మీ దంపతులిద్దరు సూర్యాపేటలో కౌన్సిలర్లుగా పనిచేశా రు. వర్దెల్లి రాములు చనిపోయే వరకు పార్టీలో కొనసాగు తూ కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తల మధ్య ఎర్ర జెండా పాటలు పాడుతూ అందరినీ ఉత్సాహపరుస్తూ ఉండేవా డు. చాలాకాలం నుండి వయోభారం, అనారోగ్య సమస్య లతో బాధపడుతున్న రాములు 79 ఏండ్ల వయసులో గత నెల 25న నిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రా మం కర్విరాల కొత్తగూడెంలో వేలాది మంది అభిమానులు, కార్యకర్తల మధ్య అంతిమయాత్ర జరిగింది. కడసారి చూపునకు చుట్టు పక్కల ప్రజలు హాజరై అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. తన జీవితంలో కమ్యూ నిస్టు కార్యకర్తగా, ఉద్యమ నాయకునిగా మచ్చలేని జీవి తాన్ని గడిపిన రాములు నేటి తరానికి ఆదర్శం. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరుతూ కామ్రేడ్‌ వర్దెళ్లి రాములుకు జోహార్లు.

(నేడు కర్విరాల కొత్తగూడెంలో వర్దెళ్లి రాములు సంతాపసభ)
– నెమ్మాది వెంకటేశ్వర్లు
9848720533