ముంబయి: భారత మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ యుఎఇ పురుషుల క్రికెట్‌జట్టు హెడ్ కోచ్‌గా ఎన్నికయ్యారు. యుఎఇ హెడ్‌కోచ్‌గా రాజ్‌పుత్ మూడేళ్లు కొనసాగనున్నారు. 1980వ దశకంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 62ఏళ్ల రాజ్‌పుత్.. 2016-17లో ఆఫ్ఘనిస్తాన్‌కు కోచ్‌గా పనిచేసిన అనుభవముంది. ఐసిసి క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2, వన్డే ట్రై సిరీస్‌లతో పాల్గొనే యుఏఇ జట్టుతో కలిసి రాజ్‌పుత్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ట్రై సిరీస్‌లో యుఏఇ జట్టుతోపాటు స్కాట్లాండ్, కెనడా జట్లు ఆడనుండగా.. ఈ టోర్నమెంట్‌కు యుఏఇ ఆతిథ్యమిస్తోంది. ఫిబ్రవరి 28నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంఢఖóం కానుంది. 2018-19లో జింబాబ్వే జట్టుకు రాజ్‌పుత్ కోచ్‌గా ఉన్నప్పుడు పురుషుల జట్టు 2022 టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.