మహంకాళి ఆలయంలో లలిత పారాయణం..

Lalitha Parayanam in Mahankali Temple..నవతెలంగాణ – వేములవాడ 
శ్రీ ఉజ్జయిని మహంకాళి క్షేత్రంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం వేములవాడ పట్టణంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో వైశ్య కమ్యూనిటీ  చెందిన మహిళలు పెద్ద ఎత్తున శ్రీ మహంకాళి అమ్మవారికి లలిత పారాయణం, లలిత సహస్రనామాలు, మణిద్వీప వర్ణన పాటించారు. మహిళలు మాట్లాడుతూ అమ్మవారి సహస్రనామం పారాయణ చేయాలన్న ఆలోచన రావటం ఎన్నో జన్మల పుణ్యఫలం అని అన్నారు.  శ్రీ లలితా సహస్రనామం కేవలం అమ్మవారి 1000 నామాలు మాత్రమే కాదు , అది ఒక శాస్త్రం అని తెలిపారు. ఉజ్జయిని మహంకాళి ప్రాంగణంలో లలిత సహస్రనామం చేయడం ఎంతో పుణ్యఫలం అని అన్నారు. అనంతరం అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహా హారతి కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల పద్మావతి, దువ్వ ఉమారాణి, పద్మ, తమ్మిశెట్టి, సుజాత, గంప మంజుల, సులోచన, రమాదేవి, వసంత, సునంద, స్వప్న, పద్మ, భవాని, పుష్పాలత, విజయ, స్వరూప, లక్ష్మి, దీపిక, లక్ష్మి తోపాటు తదితరులు పాల్గొన్నారు.