లక్షల్లో పలికిన లంబోదరుడి లడ్డు

– గణనాథుని లడ్డు లభించడం నా అదష్టం
కుమ్మరి రామకష్ణ (శాతవాహన )
నవతెలంగాణ-కేశంపేట
గ్రామీణ ప్రాంతాలలో సైతం గణనాథుని లడ్డు లక్షలు పలుకుతున్నది. లడ్డు కోసం వేలం పాటను పాడేందుకు ఎక్కువమంది భక్తులు ఆసక్తి చూపడంతో గణపతి లడ్డు ఖరీదు లక్షల్లోకి చేరుకుంటున్నది. కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో గాంధీ చౌక్‌ వద్ద వినాయక సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లంభోదరుని వద్ద శనివారం రాత్రిలడ్డూ వేలం వేశారు.పెద్ద లడ్డు గ్రామానికి చెందిన కుమ్మరి రామకష్ణ రూ.2లక్షల15వేలకు లడ్డు వేలం పాటలో కైవసం చేసుకున్నారు. చిన్న లడ్డు గజ్జె హనుమంతు 73 వేలకు దక్కించుకున్నారు. స్వామివారి మాల(దండ) వడ్ల శ్రీనివాస్‌(బొట్టు శీను) రూ.21,118 రూపాయలకు దక్కించుకున్నారు. వారిని శాలువాలతో సన్మానించారు. లడ్డు దక్కించుకున్న సందర్భంగా కుమ్మరి రామకష్ణ మాట్లాడుతూ గణనాథుని లడ్డు ప్రసాదం తనకు లభించడం నా అదష్టమని సంతోషం వ్యక్తం చేశారు. గత సంవత్సరం కూడా లంభోదరుని లడ్డును రామకష్ణనే దక్కించుకున్నారు. రెండోవ సారికూడా గణనాథుని లడ్డు ప్రసాదం రామకష్ణను వరించడం విశేషం. ఈ సందర్భంగా నిర్వహించిన గణనాథుని పూజలో కేశంపేట ఎస్‌ఐ బిఎస్‌ఎస్‌ వర ప్రసాద్‌ పాల్గొని గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణనాథుని కదిలించి శనివారం భక్తి పాటలు ఆలాపిస్తూ బ్యాండ్‌ మేళాలతో,తప్పేట తాళాలతో,సన్నాయి వాయిద్యాలతో గణనాథున్ని గ్రామం పురవీధుల గుండా ఊరేగించి గ్రామంలోని చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ గండ్ర లక్ష్మమ్మ, ఎంపీటీసీ టేకుల రమాదేవి కోటేశ్వర్‌, మాజీ ఎంపీటీసీ పల్లె రాములు, మాజీ ఉపసర్పంచ్‌ సింగిడి జంగారెడ్డి, వినాయక సేవా సమితి సభ్యులు దామోదర్‌రెడ్డి, రమేష్‌ గౌడ్‌, పాండురంగారెడ్డి, శ్రీనివాస్‌, రాఘవేందర్‌, శంకరయ్య, శేఖర్‌, వెంకట్‌రెడ్డి, లింగస్వామి, పర్వతాలు, ఆంజనేయులు, వెంకటయ్య, నర్సింలు, నారాయణ, కష్ణా, మహేష్‌, నరేష్‌, పాపయ్య, గోపాల్‌, రమేష్‌, బాలరాజ్‌, రామ్‌, లక్ష్మణ్‌, సత్యం తదితరులు పాల్గొన్నారు.