నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ గ్రామంలో సోమవారం నాటు బాంబు పేలి ఎండి ఖలీల్ అనే యువకునికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా కలకలం రేపింది. సోమవారం ఉదయం గ్రామానికి చెందిన ఖలీల్ తన పశువులను మేపేందుకు పొలం వద్దకు పశువులను తీసుకువెళ్లాడు. తాళ్లతో వాటిని కట్టేసి ఉంచేందుకు భూమిలోకి మేకు కొడుతుండగా నాటు బాంబు పేలినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఖలీల్ చేతితోపాటు కాలుకు గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని 108 అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని హుస్నాబాద్ ఏసిపి సతీష్, సిఐ శ్రీనివాస్ సందర్శించారు. ఈ నాటు బాంబులు అడవి పందులను వేటాడేందుకు వేటగాళ్లు పడేసినట్లు అనుమానిస్తున్నారు. నాటు బాంబులు గతంలో వేసినవా లేదా ఇటీవల వేసినావా అనేది తెలియాల్సి ఉంది.
.