– కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి
– ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-ఘట్కేసర్
కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలోనే భూ కబ్జాలు, అక్రమాలు, దోపిడీలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ మండలం కాచవని సింగారం, ముత్వెల్ గూడెంలో వందల ఏండ్ల చరిత్ర గల బర్లదొడ్ల భూములు కబ్జాకు గురవుతున్న విషయం తెలుసుకొని బర్లదొడ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్‌కు ఓటు వేయలేదని కక్షతో అధికారులతో, పోలీసులతో కలిసి వందల ఏండ్ల చరిత్ర గల బర్లదొడ్ల భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఘట్కేసర్ మండలంలో కబ్జాకు గురైన భూముల్లో కాంగ్రెస్ నాయకులే హస్తం ఉందన్నారు. అణగారిన వర్గాల, పేదల భూముల జోలికి వెళ్లొద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొత్తం వెంకట్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాస్వ రాజుగౌడ్, భూ బాధిత కుటుంబాలు, తదితరులున్నారు.