– భూములను తిరిగి (22 ఏ)లో పెట్టాలి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య
నవతెలంగాణ-పరిగి
మండల పరిధిలోని రాఘవపూర్‌కు చెందిన సర్వే నెంబర్ 94,95,96 విస్తీర్ణం 23,23 భూములు ప్రభుత్వ సీలింగ్ భూములు రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలని, ఆ భూములను తిరిగి (22ఏ) పెట్టాలని నేడు సీపీఐ(ఎం) ఆ ధ్వర్యంలో పరిగి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. వెంకటయ్య మాట్లాడుతూ..రాఘవాపూర్ భూములను గ త నెల ఆగష్టు 31వ తేదీన కొంతమంది రియాల్టర్లపై పట్ట మార్పిడి జరిగిందని, ఆ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయా లని, ఆ భూములను తిరిగి స్వాధీనం చేయనుకుని పేద లకు పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకునేవరకు పో రాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్య క్రమంలో సీపీఐ(ఎం) నాయకులు, హబీబ్, సత్యయ్య, రఘురామ్, శివ, రమేష్, మాంజిల్, జంగయ్య, ఆంజనే యులు, వెంకటయ్య నర్సిములు, తదితరులున్నారు.