– పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు
నవతెలంగాణ – ధర్మారం
మండలంలోని ప్రభుత్వ భూముల సర్వే ను కట్టుదిట్టంగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ జే వి. శ్యామ్ ప్రసాద్ లాల్ సర్వే అధికారులను ఆదేశించారు మండలంలో సర్వే చేస్తున్న ప్రభుత్వ భూములను శనివారం రోజు అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలో చేపట్టిన ప్రభుత్వ భూముల సర్వే కట్టుదిట్టంగా నిర్వహించాలని, అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలో సర్వే చేస్తున్న ప్రభుత్వ భూములను శనివారం రోజు పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ ప్రభుత్వ భూముల సర్వే ప్రక్రియను, ఆకస్మికంగా తనిఖీ చేశారు. బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 375 లోని ప్రభుత్వ భూమి 23 ఎకరాల 8 గుంటల సర్వే పనులను అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో నిశతంగా పరిశీలించారు. ఖిలావనపర్తి గ్రామంలో ప్రభుత్వ భూముల సర్వే ప్రక్రియ పూర్తయిందని, బొమ్మ రెడ్డి పల్లి గ్రామంలో అదనపు బృందాలను ఏర్పాటు చేసి త్వరగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కు సూచించారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ వెంట అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, తహసిల్దార్ మహమ్మద్ ఆరిపోద్దిన్, సీనియర్ అసిస్టెంట్ నవీన్ రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వరలక్ష్మి, సర్వే సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.