నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
బస్వాపురం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న బియం తిమ్మాపురం గ్రామస్తులకు ఇండ్లను వెంటనే నిర్మించి ఇవ్వాలని, నష్టపరిహారం చెల్లించాలని భూ నిర్వాసితులు కమిటీ కన్వీనర్ వల్దాస్ రాజు కాలభైరవ కోరారు. బుధవారం మండలంలోని తిమ్మాపురం గ్రామంలో భూ నిర్వాసితుల సమావేశంలో మాట్లాడారు. భూములు 1750 ఎకరాలు పూర్తిగా భస్వాపురం ప్రాజెక్టు లో ముంపునకు గురౌతున్నాయి. భూ నిర్వాసితులకు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నష్టపరిహారం విషయంలో, గ్రామ పునర్వాసం సంబందించి అన్ని విధాలుగా అన్యాయం చేసిందన్నారు. లక్షలు ఖరీదు చేసే భూములు కేవలం ఎకరానికి 15 లక్షలు ఇచ్చి అట్లా అన్యాయం చేసిందన్నారు. అదే తీరుగా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు అప్పుడున్న ఆ ప్రభుత్వం మీకు న్యాయం చేస్తాలేదు నేను గెలిచిన నెల రోజుల లో మీ గ్రామ సమస్యలు అన్ని పరిష్కారం చేస్తా అని మాట్లాడిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి మీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిన ఆ గ్రామ పరిస్తితి ఏక్కడ వేసిన గొంగడి అక్కడె ఉందన్నారు. ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన భువనగిరి మీటింగ్ కీ వచ్చినాడు ఆయన ముందు ఇండ్ల నష్టపరిహారం 50 కోట్లు వచ్చాయని మాట్లడి, ఆ డబ్బులు వచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఆ ముంపు బాధితుల ఖాతలలో ఇంకా ఇవ్వలేదనారు. ప్రాజెక్టు లో నీరు వచ్చి, క్రిమి కీటకాలు గ్రామం లోకీ వస్తున్నాయనీ, వీటి వలన ప్రజలకు ఏలాంటి హాని కల్గిన పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం బాధ్యత వహిస్తుందన్నారు. ఈ ప్రభుత్వం నష్టపరిహారం విషయంలో కాళయాపన చేస్తు ముంపు గ్రామస్థులకు అన్యాయం చేస్తుందన్నారు.నూతన గ్రామాన్ని హుస్సేన్ బాద్ 107 సర్వే నంబర్ లో చేశారు. అన్ని గుట్టలమయంగా ఉందన్నారు. వెంటనే నిధులు కేటాయించాలని, లేని యెడల భూ నిర్వాసితులందరితో కలిసి, భవిష్యత్తు కార్యాచరణ లు, కలెక్టరేట్ లు ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పిన్నం నారయణ, ఉడుత వీరాస్వామి, మణికంఠ,బిచ్చాల మహేష్,నవీన్, బాలు,పిన్నం గనేష్,పాండు ,లక్ష్మి, అనసూయ,పద్మ తదితరులు గ్రామస్థులు పాల్గొన్నారు