సాగుకు యోగ్యంగా లేని భూములను పరిశీలించి వివరాలుబ సమర్పించాలి..

Lands that are not suitable for cultivation should be examined and submitted in detail.– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
నవతెలంగాణ –  కామారెడ్డి 
సాగుకు యోగ్యంగా లేని భూములను పరిశీలించి వివరాలుబుసమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామంలోని భూములను కలెక్టర్ పరిశీలించారు. క్యాసంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 330, 331, 332, 333 లలో గల 58 ఎకరాల భూములను పరిశీలించారు. ఇందులో 30 ఎకరాల భూమిని లే ఔట్ చేసి ఉందని, మిగతా 28 ఎకరాలు పంట సాగులో ఉందని అధికారులు తెలిపారు. ఈ పరిశీలనలో ఆర్డీఓ రంగనాథ్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, తహసీల్దార్ జనార్ధన్, వ్యవసాయ అధికారి పవన్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.