పోరాడితేనే పేదలకు భూములు వస్తాయి: సిపిఎం కమ్మరి సాయిలు

నవతెలంగాణ – గాంధారి
పోరాడితేనే పేదలకు భూములు వస్తాయని సిపిఎం నాయకులు కమ్మరి సాయిలు అన్నారు. మండలంలోని మతు సంగెం శివారులో సీపీఎం జండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది నెలల నుండి మాతృసంగెం శివారులో గల119 సర్వే నంబర్లు దళితులు గిరిజనులు అంతా కలిసి ప్రభుత్వ భూమిని వ్యవసాయం చేసుకోవడం కోసం చదును చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో కొంతమంది భూస్వాములు అట్టి భూములో బోర్లు వేయడం జరుగుతుంది. దళితుల గిరిజనుల భూములు కి దొరలు అడ్డుకోవడం దొంగతనంతో బోర్లు వేసుకోవడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. అట్టి భూముల జోలికొస్తే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదని దళితుల పక్షం నిలబడుతుందని అన్నారు. జనం అంత కలిసి ఎర్ర జెండాలు పాతి సిపిఎం జిందాబాద్ అంటూ నినాదించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాములు, ఏమి సింగ్, సాయిలు సాగు చేస్తున్న రైతులు పాల్గొన్నారు.