ప్రతిష్టాత్మక రవీంద్ర భారతిలోకి ప్రవేశించగానే రవీంద్రనాథ్ టాగూర్ విగ్రహం. తెలంగాణా అతి ప్రాచీన వారసత్వాన్ని తెలిపే తిరుగులేని ఆనవాళ్ళు అయిన వక్ష శిలాజాలు దర్శనమిస్తాయి. ఈ భూమిపై మానవుడి ఉనికి ప్రారంభమవడానికి ముందు నుండే తెలంగాణా (అప్పట్లో గోండ్వానా) నేలమీద జీవాలు, పచ్చని చెట్లతో కూడిన బహత్ వనాల ఉనికి ఉంది. ప్రస్తుత మంచిర్యాల ప్రాంతంలోని సంపుటంలో లభించిన వక్షశిలాజాలే ఇందుకు సాక్ష్యం! అలాగే వేమనపల్లిలో లభించిన డైనోసార్ల శిలాజాల వల్ల మెసోజాయక్ యుగంలో బహత్ భూచరాల ఉనికి తెలంగాణా నేల మీద ఉందనే విషయం కూడా స్పష్టమవుతుంది. ఇక, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ ప్రాంతంలోని పాండవుల గుట్టలలోని గుహలపై వేసిన ‘రాతి చిత్రాలు’ ఆదిమ మానవుని అస్తిత్వానికి తొలి ఆనవాళ్ళుగా నిలుస్తాయి. దాదాపు 45 వేల ఏండ్ల నాడే తొలినాటి మానవుల అడుగుజాడలకు ఇవి చారిత్రక ఆధారాలుగా నిలుస్తున్నాయి. అలా, చరిత్ర, సంస్కతి పరంగా తెలంగాణా అత్యంత ప్రాచీనతను కలిగి ఉత్తరాది, దక్షిణాది సంస్కతుల వారధిలా ఉంది. వేలాది ఏండ్ల పరిణామ ఫలంగా తెలంగాణ రాష్ట్రం – సాహిత్య సాంస్కతిక కళా నిలయంగా రూపొందింది!
సాంస్కతికంగా, చారిత్రకంగా, సాహిత్యపరంగా దేశంలోనే విశిష్ట స్థానం తెలంగాణ నేలది. ఈ గడ్డమీద వేల ఏండ్ల నుంచి పుట్టిన ఎన్నో సాంస్కతిక కళారూపాలు ఇప్పటికీ ప్రభావవంతంగా, వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. జానపద గ్రామీణ వత్తి కళారూపాలు (చిందు యక్షగానం, ఒగ్గు కథ, డప్పులు, డోళ్లు, కోలాటం, బుర్ర కథ, బోనాల కోలాటం, పటం కథలు, కిన్నెర, బోనాలు, ఘట విన్యాసం, బైండ్ల కథ), గిరిజన కళారూపాలు (గోండి గుస్సాడి, కొమ్ము కోయ, దెంసా, లంబాడి), శాస్త్రీయ కళారూపాలు (హిందుస్తానీ, కర్ణాటక సంగీతాలు, భరతనాట్యం, కూచిపూడి, కథక్, పేరిణి, ఒడిసి), హైదరాబాది దక్కనీ కళారూపాలు (ముషాయిరా, గజల్, కవాలి, సూఫీ సంగీత్), సాహిత్యం (కవిత్వం, కథ, నవల, విమర్శ), లలిత కళలు (శిల్పకళ, చిత్రకళ, ఫొటోగ్రఫీ), 3-M కళలు (మైమ్, మ్యాజిక్, మిమిక్రీ), నాటక రంగం (పద్య, పౌరాణిక, సాంఘిక, ఆధునిక ప్రయోగాత్మక నాటకాలు), సినిమా వంటి మరెన్నో కళారూపాలకు కొలువు తెలంగాణా! సాంస్కతిక వైవిధ్యతకు నెలవు తెలంగాణ!! ఇంతటి వైవిధ్యత, విశిష్టత కలిగిన తెలంగాణా సాంస్కతిక వారసత్వాన్ని దశదిశలా చాటటం ద్వారా సాంస్కతిక పునాదులపై ‘బ్రాండ్ తెలంగాణా’ను నిర్మించే దిశగా గత పదేండ్లుగా భాషా సాంస్కతిక శాఖ అవిరామ కషి చేస్తోంది.
సంగీత – నత్య కళాశాలలు:
సాహితీ, సాంస్కతిక, కళారంగాలలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉంది. శాస్త్రీయ కళలను ప్రోత్సహిస్తూ సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో 2, సికింద్రాబాద్, వరంగల్, నిజామాబాద్, మంథనిలలో ఒక్కొక్కటి చొప్పున 6 సంగీత నత్య కళాశాలలను నిర్వహిస్తోంది. కూచిపూడి, పేరిణి, భరతనాట్యం, కథక్ వంటి నత్యాలు, హిందూస్థానీ, కర్నాటక సంప్రదాయంలో గాత్ర, వాద్య సంగీతాలలో విద్యా శిక్షణ ‘సర్టిఫికెట్’, ‘డిప్లొమా’ కోర్సులు అందిస్తుంది. ప్రభుత్వ సంగీత నత్య కళాశాలలలో ‘కళార్చన’ పేరుతో నెల నెలా విద్యార్థులచే సాంస్కతిక కార్యక్రమాలు, ఏటా వసంతోత్సవం నిర్వహిస్తూ వారిని ప్రోత్సహిస్తుంది.
సాంస్కతిక వేదికలు:
దేశవ్యాప్తంగా కళాకారుడి స్వప్నవేదిక ‘రవీంద్రభారతి’ నేడు సకల జనుల సాంస్కతిక వేదికగా భాసిల్లుతోంది. ప్రధాన హాల్‌లో సంగీత, నత్య, నాటక కార్యక్రమాలు, అధికారిక సమావేశాలతో; మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో సాహితీ చర్చలు, కవిసమ్మేళనాలు, పుస్తకావిష్కరణలతో; రెండో అంతస్తులో పైడి జైరాజ్ థియేటర్ లో సినీ ప్రదర్శనలతో నిత్యం కళకళలాడుతూ ఉంది. ఇప్పుడు రవీంద్రభారతి ప్రజాభారతిగా చేరువ కావడంలో కళాకారులు, కవులు, రచయితలు, ప్రేక్షకులదే కీలక పాత్ర. ఇవే కాక, లలిత కళాతోరణం, ఎన్టీఆర్ స్టేడియం (కళాభారతి) వంటివి సాంస్కతిక శాఖ పరిధిలో బుక్ ఫెయిర్, కోటి దీపోత్సవం, కళాశాలల వార్షికోత్సవాలు, చేతి వత్తుల ఉత్పత్తుల ప్రదర్శనలు వంటి ఆధ్యాత్మిక, విద్యా, వైజ్ఞానిక, సాంస్కతిక ఉత్సవాలకు కేంద్రాలుగా వెలుగుతున్నాయి.
సాంస్కతిక సారథి:
‘సాంస్కతిక సారథి’ వ్యవస్థను ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించిన 583 మంది కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చి గౌరవించింది. వీరందరూ జిల్లా కలెక్టర్ సారధ్యంలో, పౌర సంబంధాల అధికారి మార్గదర్శకత్వంలో ప్రభుత్వ అభివద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల భాషలో జానపద శైలిలో ఆట పాటల రూపంలో ప్రచారం చేస్తున్నారు. సాంస్కతిక సారథిలోని కవులు, కళాకారులు, సాహిత్యకారులు రాసిన ప్రభుత్వ ప్రచార పాటలను బంగారు తెలంగాణ బాటలో, సంక్షేమ స్వరాలు (తెలుగు సాహిత్యంలో అత్యధిక 505 పాటల సంకలనం), ప్రగతి పథంలో ప్రజాపాలన (ప్రభుత్వ 6 గ్యారెంటీల పైన పాటలు) పుస్తకాలుగా వచ్చాయి. ఇవే గాక, వివిధ ప్రభుత్వ సంక్షేమ అభివద్ది పథకాలపై రాసిన వందలాది పాటలను సీడీలుగా, వీడియోలుగా రూపొందించడమే కాక, జిల్లా కొక యూట్యూబ్ ఛానెల్ చొప్పున మొత్తం 33 ఛానెళ్లను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఇన్ని యూట్యూబ్ ఛానెళ్లు గల ఏకైక ప్రభుత్వ సంస్థ తెలంగాణ సాంస్కతిక సారథి ఒక్కటే.
అకాడెమీలు:
1980 దశకంలో రద్దయిన అకాడెమీలను సరికొత్తగా ఏర్పాటు చేయాలనే మేధావులు, సాహితీవేత్తలు, కళాకారుల అభ్యర్థనమేరకు అకాడెమీలను సాంస్కతిక శాఖలో భాగంగా స్థాపించారు. తెలంగాణలో సాహితీ వికాసం కోసం ప్రత్యేకంగా 2017లో ‘సాహిత్య అకాడమీ’ అభివద్ధి కోసం, 2019లో ‘సంగీత నాటక అకాడమీ’లను ఏర్పాటు చేసారు. వీటికి తోడుగా లలితకళా అకాడమీ, జానపద అకాడమీ ఏర్పాటుచేసే ప్రక్రియ ప్రారంభమైంది. తద్వారా సాహితీ, సారస్వత వికాసానికి ప్రతిఏటా రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కవి సమ్మేళనాలను, ప్రపంచ కవితా దినోత్సవం, ఉగాది సందర్భంగా కవితాగానాలను నిర్వహిస్తూన్నారు. అంతేకాక అనేక సాహిత్యాంశాలపై చర్చలు, గోష్టులు నిర్వహిస్తూ తెలంగాణా సాహితీ చరిత్రపై లోతైన అవగాహన కల్పిస్తున్నారు. నవ యువ, బాల రచయితలు, కవుల కోసం వివిధ విద్యాసంస్థలతో కలిసి శిక్షణా కార్యక్రమాలు జరుపుతున్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తుకు 15 లక్షలను, పోతన విజ్ఞాన పీఠంకు 5 లక్షలను, ఇతర సంస్థలకు వార్షిక గ్రాంటులుగా ఆర్థిక సాయం అందిస్తున్నారు.
వద్ధ కళాకారుల పింఛన్:
కళలకే అంకితమై జీవితపు చరమాంకంలో పేద వద్ధ కళాకారులకు అండగా నిలబడుతూ ప్రభుత్వం పింఛన్లు ఇస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం రూ.500/-లే ఉన్న పింఛన్ జూన్ 2021 నుండి రూ.3016/-పెంచింది. ఇవే గాక పద్మశ్రీ పురస్కార గ్రహీతలైన పేద వద్ద కళాకారులకు ప్రతినెలా 10వేలు, మరికొందరు 2024 పద్మశ్రీ గ్రహీతలకు 25 వేల చొప్పున పింఛనును అందిస్తున్నది.
పేరిణి వైభవం – 7 అంచేల వ్యూహం:
కాకతీయ కాలం నాటి శాస్త్రీయ నత్యం ‘పేరిణి’ ఇప్పుడు ఎంతో ప్రాధాన్యతను సాధించింది. రాష్ట్ర అవతరణ నాటికి వేళ్ళమీద లెక్కపెట్టగలిగే సంఖ్యలో మాత్రమే ఉన్న పేరిణి కళాకారుల సంఖ్య ఇప్పుడు వేలాదిగా పెరిగింది. జిల్లాలలో శిక్షణా కార్యక్రమాలు, వివిధ జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ఉత్సవాలలో పేరిణి కళారూపాల ప్రదర్శన, రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు అందించడం, పేరిణిపై పరిశోధన, విస్తరణ, పుస్తక ప్రచురణలను ప్రోత్సహించడం, పేరిణి నాట్య రీతిలో నూతన కంపోజిషన్స్‌ను రూపొందించడం, పేరిణి కళాక్షేత్రం ఏర్పాటుకు ప్రతిపాదించడం, ప్రభుత్వ సంగీత, నత్య కళాశాలల్లో ఒక కోర్సుగా ప్రవేశపెట్టి అమలు చేయడం వంటి 7 అంచెల వ్యూహంతో ముందుకు అడుగులు వేస్తుంది.
పండుగలు – పర్వదినాలు:
తెలంగాణ ఎన్నెన్నో ఉత్సవాలు, వేడుకల నేల! ఉగాది, రంజాన్, క్రిస్మస్ పండుగలను ప్రభుత్వం అధికారికంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. వేల ఏండ్ల నుండి ఇక్కడి ప్రజలు సంబరంగా జరుపుకుంటున్న బోనాలు, బతుకమ్మ పండుగలను 2015 లోనే రాష్ట్ర పండుగలుగా ప్రభుత్వం ప్రకటించింది. బతుకమ్మ పండుగ ప్రకతికి తెలంగాణ ఆడబిడ్డలు అర్పించే పూల పండుగ. ప్రపంచంలోనే ఒకేరోజు దాదాపు కోటిమంది మహిళలు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలలో పూల పండుగను నిర్వహించే ఉత్సవం. రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయంగా వివిధ దేశాలలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇంకా గణపతి నవరాత్రులకు ముంబాయి తర్వాత, దుర్గా నవరాత్రులకు కలకత్తా తర్వాత హైదరాబాదే పెట్టింది పేరు. మేడారం, ఏడుపాయల, నాగోబా వంటి గిరిజన జాతరలు, కొమురవెల్లి, అయినవోలు, కొరివి వీరభద్రస్వామి, లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర, మన్యంకొండ బ్రహ్మోత్సవాలు వంటి ఎన్నో జాతరలలో తెలంగాణ సంస్కతిని ప్రతిబింబించే కళా ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. అలాగే 2015లో గోదావరి పుష్కరాలు, 2016లో కష్ణా పుష్కరాల సందర్భంలో వివిధ ఘాట్‌ల దగ్గర 15 రోజుల పాటు వేలాది మంది కళాకారులతో అధ్యాత్మిక, భక్తి సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించారు.
దాశరథి, కాళోజీ – పురస్కారాలు:
సాంస్కతిక శాఖ ప్రతి ఏటా తెలంగాణా వైతాళికులైన దాశరథి, కాళోజీ వంటి తెలంగాణా సాహితీవేత్తల జయంతులను అధికారికంగా నిర్వహించడమే కాక, వారి పేరిట ప్రతిష్టాత్మకంగా రూ.1,01,116/- నగదుతో సాహితీ పురస్కారాలను కూడా ప్రదానం చేస్తోంది.
వైతాళికుల స్మరణ:
తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా జాతీయ నేతలైన మహాత్మాగాంధీ, నేతాజీ, అంబేద్కర్, జ్యోతి రావు ఫూలే, జగ్ జీవన్ రామ్, పీవీ నరసింహా రావు, జైపాల్ రెడ్డి, మహాత్మా బసవేశ్వర జయంతిని, ఈశ్వరీబాయి జయంతి, వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వీరితోపాటు కొమురం భీమ్, సురవరం ప్రతాపరెడ్డి, ప్రొ. జయశంకర్, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్, దొడ్డి కొమురయ్య, చిట్యాల అయిలమ్మ, భాగ్యరెడ్డి వర్మల జయంతులను భాషా సాంస్కతిక శాఖ ద్వారా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ, సకలజనుల ఆత్మగౌరవానికి నీరాజనాలందిస్తున్నారు. 2024 నుంచి ప్రజావాగేయకారుడు గద్దర్ జయంతిని, మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీ పాదరావు జయంతిని కూడా అధికారికంగా నిర్వహిస్తున్నారు.
దక్కనీ తెహజీబ్:
ఉర్దూ సంస్కతీ వికాసం కోసం ప్రతి సంవత్సరం ‘సలామ్-ఎ- తెలంగాణ’ పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో ఖవ్వాలీ, ముషాయిరాలు, సూఫీసంగీత్, గజల్ సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఉర్దూ నాటకానికి కూడా ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు.
ప్రపంచ తెలుగు మహాసభలు:
‘ప్రపంచ తెలుగు మహాసభల’ను తెలంగాణ ప్రభుత్వం 2017 వ సంవత్సరంలో డిసెంబర్ 15 నుండి 19 వరకు, హైదరాబాద్ రవీంద్ర భారతిలో, లాల్ బహదూర్ స్టేడియంలో, జిల్లా కేంద్రాలలో వివిధ వేదికల మీద అత్యంత వైభవంగా నిర్వహించారు. కొన్ని అంతరించి పోతున్న కళారూపాలను పునరుద్ధరించే దిశగా తెలంగాణలోని వివిధ దేవాలయాలలో ‘కళోద్ధారణ’ పేరుతో చిందు యక్షగానం, హరికథ కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేసి వారికి జీవనోపాధిని కల్పిస్తున్నారు.
పుస్తక ప్రచురణలు:
భాషా సాంస్కతిక శాఖ, తెలంగాణ చరిత్ర, సంస్కతి, సాహిత్యం, కళలు, వారసత్వం అంశాలపై ఇప్పటివరకు తెలియని ఎన్నో విశేషాలను వెలుగులోకి తీసుకురావడమే కాక, వాటన్నింటినీ గ్రంథాలుగా ప్రచురించి శాశ్వతత్వాన్ని తీసుకువచ్చే పనిలో భాగంగా దాదాపు 55 పుస్తకాలను ప్రచురించింది.
తొలిపొద్దు, కొత్తసాలు, తంగేడువనం, మట్టి ముద్ర, పద్య తెలంగాణం, తల్లివేరు, స్వేదభామి, ఆకుపచ్చని పొద్దుపొడుపు, గొల్ల రామవ్వ ఇంకొన్ని నాటికలు, తెలంగాణ తేజోమూర్తులు, కళా తెలంగాణం, పటం కతలు, తెలంగాణ వాగ్గేయ వైభవం, తెలుగు కార్టూన్, స్మర నారాయణీయం, అలుగు దుంకిన అక్షరం, కాకతీయ ప్రస్థానం, తారీఖుల్లో తెలంగాణ, తెలంగాణ రుచులు, జయ జయోస్తు తెలంగాణ, తెలంగాణ బోనాలు, కథా రచన, కల్చర్ ఆఫ్ తెలంగాణ ఎట్ సూరజ్‌కుండ్, తెలంగాణ హార్వెస్ట్, ఆదిరంగ్ మహోత్సవ్, కల్చర్ ఆఫ్ ఎమిటి, ఎ గ్రీన్ గార్లాండ్, ఉమెన్ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్, వేర్ ది హెడ్ ఈజ్ హైల్డ్ హై, ఐవిట్‌నెస్ ఆఫ్ ఎన్ ఎఫోక్, మైమ్‌స్కేప్ ఆఫ్ తెలంగాణ, నయా సాల్, మనకు తెలియని తెలంగాణ, యాదాద్రి వైభవం, ద ట్రయల్ బ్లేజర్, తెలంగాణ ప్రముఖ కవులు కావ్యాలు, తరతరాల బోధన్ చరిత్ర, బతుకమ్మ పాటలు, తెలంగాణ ముస్లిం పాలకుల తెలుగు శాసనాలు, ఉద్యమ గీత, ఎపోక్ ఆఫ్ లైన్స్, సంక్షేమ స్వరాలు, తెలంగాణ భాష ఒక అవలోకనం, శాసనోపాసన, శాసన దర్శి, తెలంగాణ సాహిత్య ప్రస్థానం, కాకతీయుల శాసనాలలో ఛందో వైవిద్యం, గోల్కొండ చరిత్ర, మిత్త అయ్యల్ వార్లు, తెలంగాణ జానపద కళా సౌరభాలు, తెలంగాణ గిరిజన సంస్కతి – సంగీతం, వాయిద్యం నత్యం, Tasrika, Telagnana Culture @ISTA, ISTA కామ్యార్థ సిద్ధిరస్తు, బోనాలు – A Devotional Offering Mother
పి.వి. నరసింహారావు శతజయంతి: బహుముఖ ప్రజ్ఞాశాలిగా, విద్యావేత్తగా, సాహితీవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, పాలనాదక్షుడిగా, ఆర్థిక సంస్కరణల ప్రతిపాదకుడిగా పూర్వ ప్రధాని పి.వి.నరసింహారావు పాత్ర రాష్ట్ర దేశ విషయాలలో అనన్య సామాన్యమైనది. ఆయన శత జయంతి సందర్భంగా వారి మూర్తిమత్వాన్ని 360 డిగ్రీలలో ఆవిష్కరించే ఆశయంతో తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ మొత్తం 8 పుస్తకాలను ప్రచురించింది. వాటిలో ఆయన స్వీయ రచనలు 4 పుస్తకాలు కాగా, మిగతావి వారి కషిని, జీవితాన్ని విశ్లేషించే అరుదైన గ్రంథాలు కావడం విశేషం.
డాక్యుమెంటరీలు
ప్రస్తుత తరం అంతా సాంకేతికతతో, దశ్య- శ్రవ్య ప్రధానమైన సాధనాల ద్వారా కొనసాగుతుంది. దీన్ని గమనించిన సాంస్కతిక శాఖ 2014 నుండే తెలంగాణలోని అరుదైన జానపద, గిరిజన కళా రూపాలను విజువల్ డాక్యుమెంటేషన్ చేయడం ప్రారంభించింది.
వాటిలో కొన్ని:-
బొమ్మలోల్లు, ఆర్ట్ ఏ హార్ట్ – కొమ్ము కోయ, శారద కథలు, కూనపులి పటం కథ, ఒగ్గు కథ, పన్నెండు మెట్ల కిన్నెర, కడ్డి తంత్రి, ఒగ్గు చుక్క, సాధనా శూరులు, కోలాటం, కాకి పడగల కథ, పేరిణి మహానత్యం, గౌడ జెట్టి పురాణం, మథుర, నాగోబా జాతర, ఒగ్గు డోలు విన్యాసం, గుస్సాడి, బైండ్ల కథ, కళా తష్ణ, Finding the Roots of
Kakatiyas in Bastar, PV: Change with Continuity, కొలుపు, సమ్మక్క – సారలమ్మ జాతర, ఏడుపాయల జాతర.
యూట్యూబ్ ఛానళ్లు: ప్రస్తుతం యావత్ ప్రపంచం సోషల్ మీడియా వెల్లువలో ఉన్న నేపధ్యంలో దేశంలోనే మొదటిసారిగా ”Department of Language and Culture Telangana Youtube Channel ను ప్రారంభించి, అందులో భాషా సాంస్కతిక శాఖ ద్వారా రూపొందిన వివిధ డాక్యుమెంటరీలను,Live Programmes ను అందుబాటులో ఉంచుతోంది.
కరోనా -6-C వ్యూహం: కరోనా మహమ్మారి విజంభణ నేపధ్యంలో ప్రపంచమంతా స్థంభించిన సందర్భంలో భాషా సాంస్కతిక శాఖ ‘6C వ్యూహం’ ను (Corona Cannot Control Culture, Creativity, Cinema) రూపొందించి ఆన్ లైన్/ డిజిటల్/ వర్చువల్ వేదికగా సాంస్కతిక, సాహిత్య, కళా కార్యక్రమాలను నిర్వహించింది.
23 మార్చి 2020 లో ‘జనతా కర్ ఫ్యూ’ విధించిన తర్వాత దేశమంతా లాక్‌డౌన్ ప్రారంభమైన పక్షం రోజులలోనే అంటే 6 ఏప్రిల్ 2020 నుంచే సంగీత, నత్య కళాశాలల విద్యార్థుల కోసం ఆన్ లైన్ తరగతులను వాట్సప్, స్కైప్ వేదికగా ప్రారంభించి దేశంలోనే ఈ తరహా కార్యక్రమాలను నిర్వహించిన తొలి శాఖగా రికార్డు సష్టించింది. అంతేగాక నటన, స్క్రిప్ట్ రైటింగ్, ఎడిటింగ్, దర్శకత్వం, ఫొటోగ్రఫీ వంటి అంశాలపై, ఆన్ లైన్ వర్క్‌షాప్ లను, అంతర్జాతీయ కవి సమ్మేళనాలను, సాహితీ చర్చలను జూమ్, గూగుల్ మీట్ ద్వారా నిర్వహించింది. జానపద కళోత్సవాలను, చిందు, ఒగ్గుకథా ఉత్సవాలను సామాజిక మాధ్యమాల ద్వారా నిర్వహించడమే కాక, కర్రసాము శిక్షణను కూడా జూమ్ ద్వారా అందించడం జరిగింది. వీటికి తోడు 100 రోజుల పాటు 100 బహు భాషా నాటకాలను యూట్యూబ్ వేదికగా ప్రదర్శించి అరుదైన రికార్డును సాధించింది.
ప్రత్యేక ఉత్సవాలు:
’75 సంవత్సరాల భారత స్వతంత్ర వజ్రోత్సవాల’ ను 2022 వ సంవత్సరం ఆగష్టు, 8 నుండి 22 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో 15 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఇందులో వివిధ సాంస్కతిక సాహిత్య కళా ప్రదర్శనలు నిర్వహించి ప్రజలలో జాతీయ భావనలు పెంపొందించారు.
2022 సెప్టెంబర్ 16 నుండి 18 వరకు, ‘జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను’ అత్యంత ఘనంగా నిర్వహించింది. 33 జిల్లాలలోని అన్ని నియోజక వర్గాలలో సమైక్యతా సాంస్కతిక ఉత్సవాలను, ర్యాలీలను నిర్వహించింది. అన్ని జిల్లాలలో వివిధ రంగాలలో గుర్తింపు పొందిన ప్రముఖులను సన్మానించారు.
తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు:
తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ద కాలం సమీపిస్తున్న సందర్భంగా రాష్ట్రమంతటా అన్ని గ్రామాలు, జిల్లాలలోనూ, రాష్ట్రస్థాయిలో రవీంద్ర భారతి వేదికగా తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. 2023 జూన్ 2 నుండి జరిగిన ఈ వేడుకలు విజయవంతం అయ్యాయి. చివరి రోజైన 2023, 22 జూన్ నాడు ‘అమరవీరుల స్మారకం’ ప్రారంభోత్సవ సందర్భంలో దాదాపు 7000 మంది తెలంగాణా జానపద, గిరిజన, శాస్త్రీయ కళాకారులతో అమరవీరుల సంస్మరణ ర్యాలీని అంబేద్కర్ విగ్రహం నుండి స్మారకం వరకు నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు.
స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు:
2023, సెప్టెంబర్ 1 వ తేదీన HICCలో భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించి జాతీయోద్యమ నాయకులకు సాంస్కతిక నీరాజనాన్ని అందించడం జరిగింది.
పదేండ్ల పండుగ వేడుకలు:
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ పదేండ్ల పండుగ వేడుకలను ట్యాంక్ బండ్ పై జూన్ 2, 2024 నాడు అత్యంత వైభవంగా ఇతర ప్రభుత్వ శాఖలతో కలిసి సాంస్కతిక శాఖ నిర్వహించింది. దీనిలో దాదాపు 1500 మంది వివిధ జానపద, గిరిజన, ఆదివాసీ, శాస్త్రీయ కళాకారులతో కూడిన కార్నివాల్ ప్రధాన ఆకర్షణగా నిలిచి, తెలంగాణ మట్టి కళారూపాల విశ్వరూపాన్ని ప్రదర్శించింది. అలాగే, తెలంగాణా సాంస్కతిక వైభవంలో భాగంగా ప్రముఖ సహజకవి అందెశ్రీ రాసిన ”జయ జయహే తెలంగాణా” గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడమే కాక, ‘పదేండ్ల పండుగ’లో వేలాది మంది ప్రజల సమక్షంలో ఆవిష్కరించి ఆ పాటకు కళాకారులు, పోలీసు సోదర, సోదరీమణులతో కవాతును జతచేసి తెలంగాణా అస్తిత్వానికి పట్టాభిషేకం చేసారు.
ఫ్లాష్ ఫోక్… ఫ్లాష్ పేరిణి:
ఆడిటోరియంలు, కళావేదికల వద్దకు ప్రేక్షకులు, ప్రజలు రావడం ఒక పద్ధతి. అయితే భాషా సాంస్కతిక శాఖ వినూత్నంగా ఆలోచించి ప్రేక్షకుల వద్దకే తెలంగాణా కళలను తీసుకెళ్ళాలనే లక్ష్యంతో ‘ఫ్లాష్ మాబ్’ తరహాలో ఫ్లాష్ ఫోక్ పేరుతో ఒగ్గుడోలు, పేరిణి నాట్య కళారూపాలను ప్రదర్శించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికోసం హైదరాబాద్ లోని ప్రముఖ షాపింగ్ మాల్ లైన లులూ, శరత్, జివికె వన్, ఇనార్బిట్ వంటి మాల్ ల యాజమాన్యాలతో సంప్రదించి ‘ఫ్లాష్ ఒగ్గు’, ‘ఫ్లాష్ పేరిణి’ కళలను ప్రదర్శించింది. వారాంతాలలో జరిగిన ఈ ప్రదర్శనలను ప్రత్యక్షంగా వేలాది మంది, పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా లక్షలాది మంది వీక్షించ గలిగారు. ఇది భారతదేశంలోనే తొలిసారి చేసిన ప్రయోగం.
తెలంగాణలో జానపద కళారూపాల సముద్ధరణ – 10 అంచెల వ్యూహం!:
తెలంగాణ ప్రభుత్వ సంకల్పం వల్ల డప్పులు, బోనాలు, రాజన్న డోల్లు, బోనాల కోలాటం, లంబాడీ-బంజారా, ఒగ్గుడోలు, కొమ్ముకోయ, గుస్సాడి, కోలాటం, చిందు యక్షగానం, శారదకాండ్రు, బైండ్లవారు, కొయ్యబొమ్మలు, హరికథ, బుర్రకథ వంటి ఎన్నో జానపద, గిరిజన కళారూపాలు ఇప్పుడు ఎంతో వైభవాన్ని సాధించాయి. తెలంగాణలో జానపద కళారూపాలు వైవిద్యతతో, విశిష్టతతో ప్రత్యేకతను సాధించుకున్నాయి. కాగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం భాషా సాంస్కతిక శాఖ ఈ జానపద కళారూపాల సముద్ధరణ కోసం 10 అంచెల వ్యూహాన్ని రూపొందించి అమలు చేస్తున్నది.
జానపద కళారూపాలను, కళాకారులను గుర్తించడం వారికి ఆన్‌ల్కెన్ విధానం/ మీసేవ ద్వారా గుర్తింపు కార్డులను అందించడం, జానపద కళారూపాలకు ప్రదర్శనావకాశాలను, వేదికలను కల్పించడం. జానపద కళారూపాల విస్తరణ కోసం ఇతర రాష్ట్రాల్లో వేర్వేరు జాతీయ ఉత్సవాలకు పంపించడం, తెలంగాణలో జరిగే జాతీయ, అంతర్జాతీయ స్థాయి జానపద, ఇతర కళాత్సోవాలలో ప్రదర్శనలు. కళారూపాలు పై గ్రంథాల ప్రచురణ ఇతర అనేక కార్యక్రమాలు చేపడుతుంది.
సాంస్కతిక శాఖ సహకారం.. యువ స్వప్నాల సాకారం!
తెలంగాణ యువతలో టాలెంట్‌కు కొదవ లేదు. అయితే ముఖ్యంగా సినిమా, టెలివిజన్, నాటకం, చిత్రకళ, లలితకళలు, సాహిత్యం లాంటి రంగాలలో అవకాశాల పరంగా వారి ప్రతిభని నిరూపించుకోవడానికి తగిన ప్రోత్సాహం గానీ, ఉత్సాహం గానీ గతంలో తగినంతగా తెలంగాణ యువతకు లభించలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాషా సాంస్కతిక శాఖ ద్వారా వివిధ కళారూపాలకు, కళా రంగాలకు సంబంధించిన యువ, నవ కళాకారులను, రచయితలను, దర్శకులను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించడం కోసం ప్రత్యేక శ్రద్ధతో 1.శిక్షణ, 2. అవకాశాల కల్పన, 3. ప్రదర్శన, 4. ప్రశంస, 5. ఆదాయం, 6. అవార్డులు అందించడం వంటి 6 అంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
వాటిలో నాటకరంగ విషయానికొస్తే, యువ కళాకారుల కోసమే ప్రత్యేకంగా 2016 లో ”యువ నాటకోత్సవం” ను ప్రారంభించి ఏడు సీజన్స్ నిర్వహించారు. దీనివల్ల యువ దర్శకులు, రచయితలు, నటులు ఎంతోమందికి నాటకాలలో అవకాశం లభించింది. అలాగే వారిలో నటనా మెళకువలను పెంచడానికి వారికి ప్రొడక్షన్ ఓరియెంటెడ్ వర్క్‌షాప్స్‌ను, శిక్షణా శిబిరాలను కూడా నిర్వహిస్త్తున్నారు.
అలాగే జానపద కళలకు సంబంధించి కొత్త తరం వారిలో ఉత్సాహం ఉంది కానీ సరైన పద్ధతిలో శిక్షణ కలిపించే అవకాశాలు లేవని గమనించి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో డప్పులు, ఒగ్గుడోలు, బోనాల కోలాటం, జడకొప్పు కోలాటం శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి అరుదైన జానపద కళారూపాలకు సంబంధించి ఔత్సాహికులైన యువతీ యువకులకు ఒక వేదికను క్రియేట్ చేస్తున్నారు.
భాషా సాంస్కతిక శాఖకు లభించిన అవార్డులు ప్రశంసలు:
దేశ రాజధాని న్యూ ఢిల్లీలో 2018 వ సంవత్సరానికి గాను ‘మన కళలు మన గుర్తింపు’ పేరిట ఆన్‌లైన్‌లో కళాకారులకు గుర్తింపు కార్డులను అందించే నవ్య విధానాన్ని పరిచయం చేసినందుకు ఒకసారి కళాకారుల గుర్తింపు కార్డు జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ‘టి.కల్చర్’ పేరుతో ఒక వినూత్న యాప్‌ను అభివద్ధి చేసినందుకు గాను, ఇలా ఈ చర్య దేశంలోనే తొలి సాంకేతిక ప్రయత్నంగా భావించి జాతీయ స్థాయిలో 2021 సంవత్సరంలోSKOCH AWARD రెండోసారి లభించింది.
సినీరంగంలో కొత్తతరం యువ దర్శక రచయితలకు ప్రత్యేక సహకారాన్ని అందించినందుకు గాను ‘ఇండివుడ్’ అవార్డ్ -2018 లో, జీ సినీ అవార్డ్ 2019లో లభించింది.
INTACHన, హైదరాబాద్ హెరిటేజ్ అవార్డ్ 2017 రవీంద్ర భారతికి లభించింది. భాష, సాహిత్య, సాంస్కతిక రంగాలలో తెలంగాణా తేజాన్ని, తెలంగాణా కళారూపాల వైభవాన్ని ఈ పదేండ్ల లో ఉన్నతిలో నిలపడంలో భాషా సాంస్కతిక శాఖ విజయవంతం అయ్యిందనడంలో సందేహం లేదు. అయితే ఈ కషి మరింత సువ్యవస్థీకతం చేసి విస్తరించాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వం మాత్రమే కాక, సాంస్కతిక, సాహిత్య, కళా సంస్థలు, కళాకారులు, సాహితీవేత్తలు, రచయితలు అందరూ కలిసి కట్టుగా ముందుకెళ్ళాలి.
– ఆదిత్య పకిడె
– భవాని