వెబ్‌సైట్‌లో లాసెట్‌ హాల్‌టికెట్లు

– జూన్‌ 3న రాతపరీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో లా కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్‌ రాతపరీక్ష వచ్చేనెల మూడున జరగనుంది. ఈ మేరకు లాసెట్‌ కన్వీనర్‌ బి విజయలక్ష్మి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. లాసెట్‌ హాల్‌టికెట్లు https://lawcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయనీ, అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. వచ్చేనెల మూడో తేదీన మూడున రాతపరీక్షలుంటాయని తెలిపారు. అదేరోజు ఉదయం తొమ్మిది నుంచి 10.30 గంటల వరకు లాసెట్‌ (మూడేండ్లు), మధ్యాహ్నం 12.30 నుంచి రెండు గంటల వరకు లాసెట్‌ (మూడేండ్లు) రెండు విడతల్లో, అదేరోజు సాయంత్రం నాలుగు నుంచి 5.30 గంటల వరకు లాసెట్‌ (ఐదేండ్లు, పీజీలాసెట్‌) నిర్వహిస్తామని పేర్కొన్నారు. మూడేండ్ల లా కోర్సుకు 36,079 మంది, ఐదేండ్ల లా కోర్సుకు 10,197 మంది, పీజీలాసెట్‌కు 4,408 మంది కలిపి 50,684 మంది అభ్యర్థులు లాసెట్‌కు దరఖాస్తు చేశారని వివరించారు.