సజన్ కుమార్ బొజ్జంతో కలిసి లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఈనెల 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, ‘రొమాన్స్, ఎంటర్ టైన్‌మెంట్, ఎమోషన్స్ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. మా సినిమా నచ్చి డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి తీసుకున్నారు. ఈటీవీ విన్ మా సినిమా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసి మాకు ధైర్యానిచ్చారు. ఈ మధ్య కాలంలో విడుదలకి ముందే ఓ చిన్న సినిమా అన్ని హక్కులు సేల్ అవ్వడం రికార్డే అని చెప్పాలి. ఈ నెల 21న ప్రీమియర్స్ వేస్తున్నాం’ అని అన్నారు. ‘ఇదొక సరికొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఎమోషనల్ రైడ్. సినిమాలో లాస్ట్ 20 నిమిషాలు అందరి హదయాలను హత్తుకుంటుంది’ అని దర్శకుడు విక్రమ్‌రెడ్డి తెలిపారు.