గతేడాది గల గల.. ప్రస్తుతం వెల వెల..!

గతేడాది గల గల.. ప్రస్తుతం వెల వెల..!నవతెలంగాణ-జైపూర్‌
గత ఏడాది ఈ పాటికి గోదావరి నది పొంగి ప్రవహిస్తోంది. హద్దులు దాటిన గోదావరి పంట పొలాల్లో పరవళ్లు తొక్కింది. ఈ ఏడాది వర్షాలు లేక గోదావరి నదిలో నీరు లేక వెళ వెళబోతోంది. 2023 జూలై నెలలో ఏకదాటిగా కురిసిన వర్షాలతో గోదావరి నదితో పాటు చెరువులు, కుంటలు నిండు కుండలను తలపించగా ఈ ఏడాది చుక్క నీరు చేరక చెవులు కుంటు వెలవెలబోతున్నాయి. గత ఏడాది భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడగా అవసరమైతే తప్పా ఇంటి నుండి బయటకు వెల్లవద్దని, గోదావరి తీర ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా చూస్తే మండల పరిధిలో నాడు గోదావరి నది హద్దులు దాటి గళగళ పారింది.ఈ ఏడాది నీటి జాడ లేక వెళ వెళ బోతుంది..