అర్థరాత్రి దాడులు.. బెదిరింపులు ఎవరి కోసం..?

రెవెన్యూ, పోలీసులు ఎవరి పక్షమో తేల్చుకోవాలి
చట్టాన్ని ఉన్నోడికి చుట్టంలా చేస్తే ఊరుకునేది లేదు..
పేదల ప్రతిఘటనకు అధికారులదే బాధ్యత
సీపీఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య
నవతెలంగాణ-నర్సంపేట
రెవెన్యూ, పోలీసులుభూకబ్జాదారుల పక్షమా. .పేదల పక్షమో తేల్చుకోవాలి..అర్థరాత్రి గుడిసెల్లో చొరబడి భయబ్రాంతులకు గురిచేసే చర్యలకు ప్రతి ఘటించడానికి సిద్ధంగాఉన్నామని సీపీఐ(ఎం) వరం గల్‌ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య అన్నారు. శ నివారం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రంగయ్య మాట్లాడు తూ పట్టణంలోని కాకతీయనగర్‌ వద్ద సర్వే నెంబర్‌ 601 లోని 1.39 ఎకరాల ప్రభుత్వభూమిలో పేదలు గుడి సెలువేసుకొని రెండున్నరేళ్లుగా నివాసం ఉంటున్నార న్నారు. భూకబ్జాదారులు పేదలపై దాడులు చేసి భ యాభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. జిల్లా కలె క్టర్‌ ఆదేశాలతో తహశీల్దార్‌ సర్వేచేసి ప్రభుత్వ భూ మిగా తేల్చి ఖాళీచేయమని సీపీఐ(ఎం) నాయకత్వం, పేదలపై కేసులు పెట్టారని గుర్తుచేశారు. ఇటీవల అ కాల, వడగండ్లవర్షాలకు గుడిసెలు కొట్టుకపోగా అదే స్థానంలో పేదలు తిరిగిమరమత్తులు చేసుకొని సరి చేసుకొంటున్నారని దీనిని సీఐ కొంత మంది భూకబ్జా దారులను వెంటేసుకొని అర్థరాత్రి వచ్చి ఖాళీ చేయా లంటూ బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్ర శ్నించారు. భూకబ్జాదారులతో పోలీసుకు ఉన్న సం బంధం ఏంటాని ప్రశ్నించారు. పేదల గుడిసెలను కాపాడాలని కోర్టును ఆశ్రంచగా స్టే ఇచ్చి ఇట్టి భూమి ప్రభుత్వానికి అవసరం ఉ న్నట్లయితే మరోచోట పే దలకు ప్రత్యామ్నాయం చూపాలని రెవెన్యూశాఖను ఆదేశించిందన్నారు.
గుడిసెల వద్దకు మరోసారి వచ్చి బెదిరింపులకు పాల్పడితే కంటెం ఆఫ్‌ ద కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని స్పష్టం చేశారు. భూకబ్జాదారులతో పోలీసులు కు మ్మక్కై పేదలపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆ రోపించారు. ఇటివల పట్టణనడిబొడ్డున సర్వే నెంబర్‌ 204లోని ప్రభుత్వ భూమిలో అక్కడ ఉన్న పేదలను కొందరు రియల్టర్లు బెదిరించి ఖాళీ చేయించి మొరం పోసి చదును చేశారని దానిని రెవెన్యూ, పోలీసులు ఎందుకు అడ్డుకొనే చర్యలు ఎందుకు చేపట్టలేదన్నా రు. అదే పేదలు ఉండేం దుకు 60గజాల భూమిలో గుడిసెలు వేసుకొని మాత్రం అధికారులు ఖాళీ చే యించడానికి నానాపాట్లు పడడం వెనుక మతలబు ఏంటాన్నారు. ప్రభుత్వం పేదలకు ఇండ్లు, ఇండ్లస్థలా లు ఇస్తామని హామీఇచ్చిందని 8 ఏళ్లుగా ఆశగా ఎదు రుచూసి ఎక్కడికక్కడా ప్రభుత్వ భూముల్లో తలదాచు కొనేందుకు గుడిసెలువేసుకొనినివసిస్తున్నారన్నారు.
వరంగల్‌ నగరంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 10వేల మందిపేదలు గుడిసెలు వేసుకొని ఉంటు న్నారని చెప్పారు. ఇదే పోరాట స్ఫూర్తితో రాష్ట్రంలోని 27జిల్లాలలో 67కేంద్రాలలో అక్కడి పేదలు గుడిసె లు వేసుకొని జీవనాన్ని సాగిస్తున్నారన్నారు. అనేక భూకబ్జాదారుల, పోలీసుల దాడులను ఎదుర్కొంటూ ఇక్కడి నుంచి ఖాళీచేసి వెళ్లేది లేదని ప్రాణాలను లెక్క చేయకండా పేదలు గుడిసెలను కాపాడుకుంటు న్నా రని తెలిపారు.చివరకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి జివో 58 ద్వారా పట్టాలు ఇచ్చిఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించిందన్నా రు. ఇలా ప్రభుత్వమే పేదల పట్ల సానుకూలంగా ఉంటే నర్సంపేటలో మాత్రం అందుకు భిన్నంగా అ ధికారులు వ్యవహరిస్తూ గుడిసెలను ఖాళీ చేయిం చేందుకు పూనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
చట్టాన్ని ఉన్నోడికి చుట్టంగా చేస్తే ఊర్కునే ప్రస క్తేలేదని స్పష్టంచేశారు. గుడిసెలలను కాపాడుకోవడా నికి ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని పోలీ సుదాడులను తిప్పికొట్టే ప్రతిఘటనలో జరిగే పరిణా మాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిం చారు. సీపీఐ(ఎం) పట్టణకార్యదర్శి హన్మకొండ శ్రీధ ర్‌ మాట్లాడుతూ పట్టణంలోని సర్వే నెంబర్‌ 702, 111,204,56,813 సర్వేనెంబర్‌లోని కోట్ల విలువైన భూములను కబ్జా చేస్తుంటే కాపాడలేని అధికారులు జానెడు జాగలోగుడిసెలు వేసుకొని నివస్తున్న పేదల పై జులం ప్రదర్శించడం అన్యాయమన్నారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించాలని పేదల గుడిసెలను కాపాడి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకపో తే తీవ్రపోరాటాలు చేసైనా రక్షించుకోవడానికి వెను కాడమన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, జిల్లా కమిటి సభ్యులు నమిండ్ల స్వామి, ముంజాల సాయిలు, అనంతగిరి రవి, పట్టణ నాయకులు గడ్డ మీద బాలకృష్ణ, కందికొండరాజు పాల్గొన్నారు.