సరికొత్తగా సిరిమల్లె పువ్వా.. పాట

హతిక్‌ శౌర్య హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఓటు’. ‘చాలా విలువైనది’ అనేది ట్యాగ్‌ లైన్‌. ఫ్లిక్‌ నైన్‌ స్టూడియోస్‌ నిర్మాణంలో రవి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ చిత్రంలోని ‘సిరిమల్లె పువ్వా..’ పాటని లాంచ్‌ చేశారు. ఈ పాట కోసం ‘పదహారేళ్ళ వయసు’ సినిమాలోని ఎవర్‌ గ్రీన్‌ మెలోడి ‘సిరిమల్లె పువ్వా..’ని సంగీత దర్శకుడు అగస్త్య రీమిక్స్‌ చేశారు. ‘ఒరిజినల్‌ పాటలోని మాధుర్యాన్ని మరింతగా పెంచుతూ సింగర్‌ సునీత మెస్మరైజింగ్‌గా ఆలపించారు. వేటూరి సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ పాటలో విజువల్స్‌ ప్లజంట్‌గా ఉన్నాయి. నాయిక తన్వీ నేగి అందంగా కనిపించింది’ అని చిత్ర బృందం తెలిపింది.