సికింద్రాబాద్‌లో లాఠీచార్జి సహించరానిది

– కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ముత్యాలమ్మ విగ్రహాన్ని విధ్వంసం చేసిన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ సికింద్రాబాద్‌లో ధర్నా చేసిన వారిపై పోలీసుల లాఠీచార్జి సహించరానిదనీ, పోలీసుల దౌర్జన్యకాండ కాంగ్రెస్‌ సర్కారు దురహంకారానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఒకే విధానాలను అనుసరిస్తున్నాయని విమర్శించారు.
జీవో 29 విషయంలో గ్రూపు-1 అభ్యర్థులు, నిరుద్యోగులు వారం నుంచి ఆందోళన చేస్తున్నా సీఎంకు పట్టదా? వారితో చర్చించే సమయం లేదా? అని ప్రశ్నించారు.