హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో రాబోతున్న చిత్రం ‘సత్యం సుందరం’. ’96’ ఫేమ్ సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. టీజర్‌ని విడుదల చేసి మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ టీజర్ కార్తీ, అరవింద్ స్వామిల ప్రపంచాలను పరిచయం చేసింది. వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ హైలెట్‌గా ఉంది. వీరిద్దరు డిఫరెంట్ లైఫ్ స్టయిల్‌లో ఆకట్టుకున్నారు. కార్తీ అమాయకత్వంతో కూడిన రస్టిక్ క్యారెక్టర్ చేస్తే, అరవింద్ స్వామి రిజర్డ్వ్, అర్బన్ పర్సనాలిటీగా కనిపించారు. ’96’లో డ్రామాని డీల్ చేయడంలో తన సత్తా చాటిన దర్శకుడు ప్రేమ్ కుమార్ లీడ్ రోల్స్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. కార్తీ, అరవింద్ స్వామి డిఫరెంట్ రోల్స్‌లో మ్యాజిక్ క్రియేట్ చేసారు. ఈ టీజర్ గ్రేట్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహేంద్రన్ జయరాజు కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. గోవింద్ వసంత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎమోషన్‌ని మరింత ఎలివేట్ చేసింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 28న ఈ సినిమా విడుదల కానుంది. ‘వైవిధ్యమైన సినిమాలకు, పాత్రలకు అరవింద్‌స్వామి, కార్తీ పెట్టింది పేరు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: సి.ప్రేమ్ కుమార్, నిర్మాతలు: సూర్య, కార్తీ, సంగీతం: గోవింద్ వసంత, డీవోపీ: మహేందిరన్ జయరాజు,
ఎడిటర్: ఆర్ గోవింద్‌రాజ్.