స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఎండీ.ఆసిఫ్ జానీ నిర్మాతగా, శివకళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తురుమ్ ఖాన్‌లు’. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎస్‌విఐటీ కాలేజ్, సికింద్రాబాద్‌లో ఘనంగా జరిగింది. అత్యంత వైభవంగా జరిగిన ఈ ఈవెంట్‌కి బాలీవుడ్ స్టార్ సోనూసూద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పల్లెటూరు రివేంజ్ కామెడీ జోనర్‌లో మొదటి సారి మహబూబ్ నగర్ స్లాంగ్‌లో తెరకెక్కెక్కించిన ఈ చిత్రం అన్ని పనులను ముగించుకొని ఈనెల 8న విడుదలకు రెడీ అయ్యింది. నిర్మాత ఎండి అసిఫ్ జానీ మాట్లాడుతూ, ‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమా ఇది’ అని తెలిపారు. ‘సినిమాలో చాలా మంచి సబ్జెక్ట్ ఉంది. వచ్చే ఏడాదికి తురుమ్ ఖాన్‌లు పార్ట్ 2, పార్ట్ 3 తీస్తే బాగుంటుంది. అందరూ కొత్త వాళ్ళే అయినా ఈ సినిమా రెండున్నర గంటలసేపు ప్రేక్షకులను కచ్చితంగా నవ్విస్తుంది’ అని సోనూసూద్ అన్నారు.