నవ్వించే చతుర్‌, వితుర్‌

నవ్వించే చతుర్‌, వితుర్‌ఆర్‌ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్‌ పతాకంపై శ్రీనివాస్‌ రామిరెడ్డి, డా.తిమ్మప్ప నాయుడు పురిమెట్ల. శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. ‘మై నేమ్‌ ఈజ్‌ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్‌ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్‌, సాయి కుమార్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శ్రీనివాస రెడ్డి, చమ్మక్‌ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘పేపర్‌ బారు’ చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్న జయశంకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ  అవుతోంది. సోమవారం ఈ సినిమా నుంచి చతుర్‌, వితుర్‌గా శ్రీనివాస రెడ్డి, చమ్మక్‌ చంద్ర క్యారెక్టర్స్‌ ఫస్ట్‌ లుక్‌ను మేకర్స్‌ రివీల్‌ చేశారు. వీరిద్దరు పండితుల వేషధారణలో  సంభాషిస్తున్న స్టిల్‌ను పోస్టర్‌గా విడుదల చేశారు. చతుర్‌, వితుర్‌ అనే పేర్లలోనే నవ్వు ధ్వనిస్తోంది. శ్రీనివాస రెడ్డి, చమ్మక్‌ చంద్ర ఈ పాత్రల్లో వినోదాన్ని అందించ బోతున్నారని వేరే  చెప్పక్కర్లేదు. ఈ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. రిలీజ్‌ డేట్‌ను అఫీషియల్‌గా మూవీ టీమ్‌ అనౌన్స్‌ చేయనుంది. ఈ చిత్రానికి మ్యూజిక్‌ : అనుప్‌  రూబెన్స్‌, ఎడిటర్‌ : జి. అవినాష్‌, లిరిక్స్‌ : కాసర్ల శ్యాం, వనమాలి, కళ్యాణ్‌ చక్రవర్తి.